
గుండె నిండా గుడి గంటలు సీరియల్ 510వ ఎపిసోడ్‌లో బాలు, మీనా మధ్య ప్రేమ పులకింతలు, మనోజ్, రోహిణి తంటాలు, ప్రభావతి చేసిన రచ్చ చూడండి. సుశీల పెట్టిన నియమాల వల్ల కలిగే ఇబ్బందులు కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణ.
Key Points
బాలు, మీనా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు
మనోజ్, రోహిణి హాల్లో తంటాలు
సుశీల నియమాల వల్ల కలిగే ఇబ్బందులు
బాలు, మీనా రొమాన్స్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 510వ ఎపిసోడ్ సుశీల రూల్ తో ఇబ్బందిపడే మనోజ్, రోహిణి.. గదిలో బాలు, మీనా రొమాన్స్.. డైనింగ్ టేబుల్ దగ్గర మనోజ్ షాపు ఓపెనింగ్ పై జరిగే రచ్చ.. ఆ తర్వాత ప్రభావతి చేతులు మీదుగా షాపు ఓపెన్ చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది. ఇంకా ఏం జరిగిందో చూడండి.
మనోజ్‌ను రూమ్‌లో నుంచి వెళ్లగొట్టిన బాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ మనోజ్ ను బాలు రూమ్ లో నుంచి వెళ్లగొట్టే సీన్ తో మొదలవుతుంది. సుశీల పెట్టిన రూల్ ప్రకారం తన గదిని బాలు, మీనాలకు ఇవ్వాల్సి ఉన్నా మనోజ్ ఇవ్వకపోవడంతో అతన్ని బలవంతంగా బయటకు తీసుకొస్తాడు బాలు.
హాల్లో దోమలు, ఏసీ లేదంటూ మనోజ్ సాకులు చెబుతాడు. ప్రభావతి కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. అయితే బాలు, మీనాలకు రవి, శృతి, సత్యం మద్దతుగా నిలవడంతో ఇక చేసేది లేక మనోజ్, రోహిణి హాల్లో పడుకోవడానికి సిద్ధమవుతారు.
అయితే తనను ఇబ్బంది పెట్టిన బాలుపై పగ తీర్చుకోవాలని మనోజ్ అనుకుంటాడు. అతన్ని హాయిగా గదిలో పడుకోనివ్వనని శపథం చేస్తాడు. పదే పదే ఏదో ఒక వంకతో వెళ్లి గది తలుపు కొడతాడు. మీనా వచ్చినట్లుందని సంతోషంతో బాలు డోరు తీస్తుంటాడు. కానీ మనోజ్ ఒకసారి ఛార్జర్ అని, మరోసారి దిండు కావాలని, ఇంకోసారి ఎలాంటి కారణం లేకుండా రావడంతో అతనికి గదిలోని వస్తువులన్నీ తీసి ఇచ్చి పంపిస్తాడు బాలు. దీంతో చేసేది లేక మనోజ్ హాల్లో పడుకోవడానికి రెడీ అవుతాడు.
మనోజ్, రోహిణి ఇబ్బందులు
అటు మీనా గదిలోకి వచ్చిన తర్వాత ఇద్దరూ కాస్త రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. బెడ్ పై పడుకోకుండా మీనా చాప తెచ్చుకొని కింద వేస్తుంది. మంచం ఉంది కదా అని బాలు అంటే అది మనదు కాదు అని అంటుంది. అయితే తాను కూడా కిందే పడుకుంటానని బాలు అంటాడు. నీ పక్కన పడుకుంటనే నిద్ర పడుతుందని, నీ తల నా గుండెలపై ఉండాలని మీనాతో చెబుతాడు. నీ దగ్గరిని వచ్చే పూల వాసనతోనే తనకు నిద్ర పడుతుందని బాలు అంటాడు. ఇద్దరూ అలా కాసేపు రొమాంటిక్ ముచ్చట్లతో గడుపుతారు.
హాల్లో మనోజ్, రోహిణి తంటాలు
ఇటు హాల్లో మనోజ్, రోహిణి తంటాలు పడుతూ ఉంటారు. ఏసీ లేకుండా ఈ ఉక్కపోత, దోమలు కుడుతుంటే తనకు నిద్ర పట్టదని మనోజ్ అంటాడు. నెలలో రెండు వారాలు ఇలా చేయాలంటే తన వల్ల కాదని రోహిణితో చెబుతాడు. అవసరం లేదని, శృతి మనకు దారి చూపిస్తుందని రోహిణి అంటుంది.
వచ్చే వారం రవి, శృతి హాల్లో పడుకోవాలి కదా.. శృతి అంత గొప్పింటి నుంచి వచ్చి ఇక్కడ అడ్జెస్ట్ కాలేదు.. అప్పుడు ఆమె గొడవ చేస్తుంది.. తన తల్లితో చెప్పి ఏదో ఒకటి చేయిస్తుంది లే.. అది మనకు కూడా కలిసి వస్తుంది అని రోహిణి చెబుతుంది. దీంతో మనోజ్ సరే అంటాడు. కానీ రాత్రంతా అతనికి నిద్ర ఉండదు. ఉక్కపోత, దోమలతో కాపురం చేస్తాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర మనోజ్ కునుకు
ప్రభావతి షాప్ ఓపెనింగ్
ఉదయాన్నే కిందికి వచ్చిన తల్లితో తనకేంటీ కష్టాలు అని మనోజ్ అంటాడు. కోటీశ్వరుడి ఇంటి నుంచి వచ్చిన రోహిణి కూడా కిందే పడుకుంటోంది కదా అని ప్రభావతి అంటుంది. తనకు వారం రోజులు ఇవ్వమని, పరిష్కారం చూపిస్తానని ప్రభావతి అతనికి హామీ ఇస్తుంది. ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి కూర్చుంటారు.
అందరూ టిఫిన్ చేస్తుంటే.. మనోజ్ మాత్రం కునుకు తీస్తుంటాడు. అతన్ని చూసి బాలు, రవి, శృతి, మీనా, సత్యం నవ్వుకుంటారు. రేపు షాపు ఓపెనింగ్ పెట్టుకొని ఎవరితో ఓపెనింగ్ చేయించాలో తేల్చకుండా ఇలా ఇంట్లో కునుకు తీస్తే ఎలా అని శృతి నిలదీస్తుంది.
సెలబ్రిటీతో ఓపెనింగ్ చేయిద్దామనుకుంటున్నానని, లక్షో రెండు లక్షలో ఇవ్వాల్సి ఉంటుందని మనోజ్ అంటాడు. దీంతో సత్యం అతన్ని తిడతాడు. అంత డబ్బు వాళ్లకు తగిలేయడం కంటే దాని బదులు ఎలక్ట్రానిక్స్ కూడా పెట్టాలనుకుంటున్నావు కదా.. ఆ పని చెయ్ అని చెబుతాడు. ఇదేమీ ఇంటి ముందు పూల షాపు కాదు అంటూ రోహిణి.. మీనాను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అయినా సెలబ్రిటీలు ఎందుకు.. నువ్వు ఏం చేసినా నీకు సపోర్ట్ చేసే అమ్మ ఉంది కదా ఆమెతోనే చేయించు అని బాలు అంటాడు. కానీ మనోజ్, రోహిణి మాత్రం ఇష్టం లేనట్లుగా ముఖం పెడతారు.
ఆ తర్వాత ప్రభావతి రిబ్బన్ కట్ చేసి షాపు ఓపెన్ చేస్తుంది. అయితే బోణీ విషయంలో రచ్చ చేస్తుంది. శృతి తల్లి శోభ ఏకంగా రూ.1.5 లక్షలు పెట్టి ఖరీదైన సోఫా కొంటే.. మీనా రూ.5 వేలతో మిక్సీ కొంటుంది. మీనాతో బోణీ చేయిద్దామని సత్యం, పూలు అమ్ముకునే దానితో బోణీ అవసరం లేదని ప్రభావతి రచ్చ చేస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఎన్నో ఉత్కంఠభరితమైన ఘట్టాలు చూడొచ్చు. ప్రేమ, కుటుంబ కలహాలు, మరియు కొత్త సవాళ్లతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరం.


