|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అమ్మా అంటూ రోహిణి ఇంటికే వచ్చేసిన చింటూ.. నిలదీసిన మనోజ్, బాలు.. రచ్చ రచ్చ

Published: 23-09-2025, 11:14 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అమ్మా అంటూ రోహిణి ఇంటికే వచ్చేసిన చింటూ.. నిలదీసిన మనోజ్, బాలు.. రచ్చ రచ్చ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ 517వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చింటూ యాక్సిడెంట్, రోహిణి హాస్పిటల్‌కు వెళ్ళడం, బాలు, మీనా, మనోజ్‌తో ఆమె గొడవలు సీరియల్‌ను ఉత్కంఠభరితంగా మార్చాయి.

Key Points

1

రోహిణి కొడుకు చింటూ యాక్సిడెంట్‌లో గాయపడటం

2

హాస్పిటల్‌లో బాలు, మీనా రోహిణిని నిలదీయడం

4

మనోజ్‌కు రోహిణి క్లాస్ పీకడం

చింటూ యాక్సిడెంట్ మరియు రోహిణి ప్రతిస్పందన

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 517వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. కొడుకును చూడటానికి రోహిణి హాస్పిటల్ కు వెళ్లడం, అక్కడ బాలు, మీనా ఆమెను నిలదీయడం, ఇంట్లో చింటూ గురించి చెప్పేస్తానని తల్లితో రోహిణి చెప్పడం, చివరికి చింటూ ఇంటికే వచ్చినట్లుగా కలగనడంలాంటి సీన్లతో సాగిపోయింది.

మనోజ్‌కు క్లాస్ పీకిన రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్ షాపులో మనోజ్‌కు రోహిణి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు వచ్చేలా చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడదామని మనోజ్ అనడంతో రోహిణి క్లాస్ పీకుతుంది. చెత్తగా ఉంది ఐడియా.. పాత ఓనర్ క్వాలిటీ చూసే వచ్చారు.. ఇప్పుడు తెలిస్తే బిజినెస్ మునుగుతుందని ఆమె చెబుతుంది.

రోహిణికి ఫోన్ చేసిన తల్లి..

అటు మనోజ్ పక్కన ఉండగానే రోహిణి కి తల్లి ఫోన్ చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలంటూ ఆమెపై రోహిణి మండిపడుతుంది. కానీ చింటూకి యాక్సిడెంట్ జరిగిందని, కళ్లకు గాయమైందని ఆమెకు చెబుతుంది. దీంతో రోహిణి కంగారు పడుతుంది.

వెంటనే వస్తానని అనడంతో బాలు , మీనా ఇక్కడే ఉన్నారని, వాళ్లు వెళ్లిన తర్వాత రమ్మని తల్లి చెబుతుంది. రోహిణి కంటతడి పెడుతుంది. తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్లి హాస్పిటల్స్ లో వాటర్ కెటిల్స్ ఫ్రీగా పంచి మన షాప్ కు పబ్లిసిటీ చేసే ఐడియా ఉందని, ఆ పని మీద వెళ్తానని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రోహిణి మరియు మనోజ్ మధ్య గొడవ

రోహిణి తల్లికి ధైర్యం చెప్పిన బాలు, మీనా

అటు బాబుకి ఏం జరిగిందో అని రోహిణి తల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఆమెకు బాలు, మీనా ధైర్యం చెబుతారు. ఏమీ కాదని, బాబు మళ్లీ పూర్తి నార్మల్ అవుతాడని మీనా అంటుంది. ఆ వెంటనే డాక్టర్ కూడా బయటకు వస్తాడు. సర్జరీ పూర్తియిందని, ప్రమాదం ఏమీ లేదని అంటాడు. సమయానికి తీసుకురావడంతో కంటి నరాలకు కూడా ఏమీ జరగలేదని చెబుతాడు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అంటాడు. దీంతో బాలు, మీనాతోపాటు చింటూ అమ్మమ్మ కూడా ఊపిరి పీల్చుకుంటుంది.

హాస్పిటల్‌కు రోహిణి.. నిలదీసిన బాలు, మీనా

ఆ తర్వాత రోహిణి హాస్పిటల్ కు వెళ్తుంది. ముందుగా మేనేజర్ దగ్గరకు వెళ్లి తమ షాపు ప్రమోషన్ కోసం కెటిల్స్ ఫ్రీగా ఇస్తున్నామని, ముందుగా చిల్డ్రెన్ వార్డు నుంచి ఇస్తామని అంటుంది. సరే అని ఆమెను అక్కడికి పంపిస్తాడు. అప్పుడే ఆ వార్డు నుంచి బయటకు వస్తున్న బాలు, మీనా.. రోహిణిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. షాపు ప్రమోషన్ కోసం కెటిల్స్ పంచుతున్నానని అంటుంది.

మీరేంటి ఇక్కడ అని రోహిణి అనడంతో మీనాకు బాలేదని వచ్చామని, అలాగే తమకు తెలిసిన బాబుకు బాలేదని అంటారు. అతనికి ఎలా ఉంది.. బాగానే ఉన్నాడా.. కళ్లకు ఏమీ కాలేదు కదా అని కంగారు పడుతూ అడుగుతుంది రోహిణి. వాళ్లు నీకు కూడా తెలుసు అని, ఏ ప్రమాదం లేదని, వార్డుకు వెళ్లినప్పుడు చూసి, ఆ పెద్దావిడను కూడా కలిసి రమ్మని మీనా చెబుతుంది.

బాలు మరియు మీనా చర్యలు

చింటును చూసి రోహిణి ఎమోషనల్..

అటు చింటును చూసి రోహిణి ఎమోషనల్ అవుతుంది. అమ్మగా ఎలాంటి ప్రేమ చూపించలేకపోతున్నానని ఏడుస్తుంది. చింటూకి ఇలా అయినందుకు తల్లిని తిడుతుంది. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావని నిలదీస్తుంది. ఎన్నాళ్లని ఇంట్లో బంధిస్తానని, ఇంటి ముందే కదా అని వదిలేశానని అంటుంది.

బాలు, మీనా కలిశారని, ఎక్కువసేపు ఉంటే వాళ్లకు అనుమానం వస్తుందని రోహిణి చెబుతుంది. ఇంకా ఎన్నాళ్లు ఈ విషయం దాస్తావు.. మీ ఆయన మనసు గాయపడకుండా ఎలాగోలా ఈ విషయం చెప్పు అని తల్లి అనడంతో సరే అని రోహిణి అంటుంది.

తర్వాత బయటకు వస్తుండగా.. బాలు, మీనా ఇంకా అక్కడే ఉంటారు. వాళ్లను చూసి రోహిణి మరింత కంగారు పడుతుంది. అటు మీనా కూడా చింటూని వదిలి వెళ్లాలని లేదని, ఆ పెద్దావిడకు ధైర్యం చెప్పేందుకు తాను ఇక్కడే ఉంటానని బాలుతో అంటుంది మీనా. సరే అని బాలు అంటాడు.

అటు ఎపిసోడ్ చివర్లో తనను అమ్మా అని వెతుక్కుంటూ రోహిణి దగ్గరికి వస్తాడు చింటూ. అతన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడుతుంది. అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ తోపాటు ఇంట్లో వాళ్లందరూ వచ్చి వీడు నీ కొడుకా అని రోహిణిని నిలదీసినట్లుగా చూపించారు. చూస్తుంటే ఇది రోహిణి కల కంటున్నట్లుగా అనిపించింది. అక్కడితే గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

చివరగా, చింటూ యాక్సిడెంట్ తర్వాత కలిగిన సంఘటనలు సీరియల్‌ను ఆసక్తికరంగా మార్చాయి. రోహిణి కుటుంబ సభ్యులతో గొడవలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, చింటూ భవిష్యత్తు ఏమిటి అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.