
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రభావతి నోరు జారి పరువు తీసుకుంది. నగలపై సస్పెన్స్ కొనసాగగా, మౌనిక అనుకోకుండా చిక్కుల్లో పడింది. ఈ ఆసక్తికరమైన మలుపులతో ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Key Points
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్‌లో ప్రభావతి మరోసారి నోరు జారి పరువు పోగొట్టుకుంది.
నగలపై సస్పెన్స్ కొనసాగింది, సుశీల మీనాను నగలు వేసుకోమని అడగడంతో ప్రభావతి కంగారు పడింది.
సంజూకి తెలియకుండా పుట్టింటికి వచ్చిన మౌనిక అనూహ్యంగా చిక్కుల్లో పడింది.
సుశీల మాటల వల్ల ప్రభావతి పరువు మరింత పోవడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది.
ప్రభావతికి సుశీల వార్నింగ్.. నగలపై కొనసాగిన సస్పెన్స్
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ ప్రభావతి మరోసారి నోరు జారి పరువు తీసుకుంటుంది. అటు నగల గురించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రభావతిని శృతి తల్లి శోభ మరింత ఇరికిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 552వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుశీల్ 75వ పుట్టిన రోజు సందడి, నగల గురించి ప్రభావతి ఆందోళన, సంజూకి తెలియకుండా పుట్టింటికి వచ్చిన మౌనిక చిక్కుల్లో పడటంలాంటి సీన్లతో సాగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
నగల గురించి అడిగి ప్రభావతిని ఇరికించిన సుశీల..
దీంతో సుశీల వెళ్లి నువ్వు ఆడదానివి కావా.. మిగిలిన కోడళ్ల సాయం తీసుకొని నువ్వే వంట చెయ్యు అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత మీనాను నగలు వేసుకోమని సుశీల అడగడంతో ప్రభావతి, మనోజ్ కంగారు పడతారు. తర్వాత ప్రభావతి కిచెన్ లోకి వెళ్తుంది.
మౌనిక చిక్కుల్లో.. సువర్ణ, కామాక్షిల అబద్ధం
సంజూకి అబద్ధం చెప్పిన సువర్ణ
టీవీ తీసుకొచ్చిన కామాక్షి.. ఇంట్లో వాళ్లకు అనుమానం
మధ్యమధ్యలో కామాక్షి తానే టీవీని మోసుకొచ్చానని చెప్పడంతో వాళ్లలో అనుమానం మరింత ఎక్కువ అవుతుంది. సుశీల కూడా సత్యాన్ని గిల్లి అసలు ఇది కలా నిజమా అని అడుగుతుంది. తమ షాపులో టీవీలు ఉండగా వేరే షాపులో ఎందుకు కొన్నావని మనోజ్ కూడా అడుగుతాడు. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది.
నగలు వేసుకొని వచ్చిన మీనా..
సుమతి పెళ్లి టాపిక్.. ప్రభావతి పరువు మరింత మంటగలిసిన వైనం
మౌనికకు సంజూ, సువర్ణ ఫోన్
ఇంటికి వచ్చిన పార్వతి, సుమతి.. అవమానించిన ప్రభావతి..
సుమతి పెళ్లి టాపిక్ రావడంతో తాను జాబ్ సంపాదించాకే పెళ్లి చేసుకుంటానని ఆమె చెబుతుంది. దీంతో శృతి ఆమెను అభినందిస్తుంది. సుశీల కూడా ఆమెను మెచ్చుకుంటూ.. ఆడవాళ్లకు ఉద్యోగం తప్పనిసరి అని, లేదంటే తన కోడలు ప్రభావతిలాగా ఎందుకు పనికి రాకుండా పోతారని అనడంతో ఆమె పరువు మరింత పోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ప్రభావతి పరువు పోవడం, నగల సస్పెన్స్, మౌనిక ఇబ్బందులతో నేటి ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్‌లలో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


