|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: విద్య ఇంట్లో రోహిణి సీక్రెట్ మీటింగ్! బాలు షాక్!

Published: 03-03-2026, 11:35 PM
గుండె నిండా గుడి గంటలు: విద్య ఇంట్లో రోహిణి సీక్రెట్ మీటింగ్! బాలు షాక్!
  • గుడిలో మీనా భారీ ఏర్పాట్లు,ప్రభావతిపై సెటైర్లు పేల్చిన బాలు,సత్యం!
  • మనోజ్ వడ్డీ కోసం విద్య ఇంటికి, అడ్డుపడ్డ రోహిణి!
  • చింటు, సుగుణలతో రోహిణి ఉండగా విద్య ఇంటికి బాలు ఎంట్రీతో ఉత్కంఠ!
  • మౌనిక విషయంలో బాలు, ప్రభావతి మధ్య గొడవలు!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్! రోహిణి సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతుంది. బాలుకు దొరికిపోతుందా? అసలేం జరుగుతుందో చూడండి!

గుడిలో సందడి చేసిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ (gunde ninda gudi gantalu today episode) ఈరోజు ఎపిసోడ్ లో రోహిణికి మరోసారి బాలు గండం ఎదురవుతుంది. విద్య ఇంట్లో చింటు, సుగుణలతో ఆమె దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మౌనిక కోసం సత్యం ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తుంది. అయితే అదే సమయంలో మనోజ్ వడ్డీ కక్కుర్తి రోహిణిని ప్రమాదంలో పడేస్తుంది. బాలుకి ఆమె దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

గుడిలో పూజకు మీనా అన్ని ఏర్పాట్లు.. ప్రభావతికి క్లాస్

పూలతోపాటు గుడిలో ప్రత్యేక పూజల కోసం టికెట్, అమ్మవారికి సారె, పంతులుగారికి ముందే చెప్పి పూజకు ఏ లోటూ రాకుండా చూస్తుంది. చివరికి అన్నదానం కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఆమెకు గుడిలో ఉన్న ఫాలోయింగ్ చూసి బాలు, సత్యం, రవి, శృతి, మౌనిక ఆనందించగా.. ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం ఏడుస్తుంటారు. ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటుంది. దీంతో ఆమె ఇక మారదని బాలు, సత్యం అనుకుంటారు.

వడ్డీ కోసం విద్య దగ్గరికి మనోజ్.. అడ్డుకున్న రోహిణి

విద్య ఇంటికి మనోజ్ రాక

అక్కడే చింటు, సుగుణ ఉండటంతో ఎక్కడ విషయం బయటపడి పోతుందో అని కంగారు పడుతూ తానే వెళ్తానని రోహిణి అంటుంది. నువ్వు వెళ్తే సమాధానం వస్తుంది.. నేను వెళ్తేనే వడ్డీ వస్తుందని చెప్పి మనోజ్ ను ఆపి తాను వెళ్తుంది.

మౌనిక విషయంలో బాలు, ప్రభావతి గొడవ

బాలుకి రాజేష్ ఫోన్.. సుగుణ వెంట రోహిణి వెళ్లిందని చెప్పి..

మౌనికను నిలదీసిన సత్యం.. ఏడ్చేసిన మౌనిక

బాలు రాకతో ఉలిక్కిపడ్డ రోహిణి

అది విని మౌనిక మనసులోనే తన బాధలను తలచుకుంటుంది. సత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది. కానీ ఇంట్లో తాను అనుభవిస్తున్న బాధలను చెప్పదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నా అత్త, మామలు కావాలన్నారని, అందుకే ఆయన అలా ఉన్నారని కవర్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా మీతో కూర్చొని కష్టసుఖాలు మాట్లాడటంతో ఏడుపొచ్చేసిందని చెబుతుంది.

రోహిణికి క్లాస్ పీకిన తల్లి సుగుణ

విద్యతో బాలు గొడవ.. చింటు గురించి ఆరా

ఆమెను చూసి బాలులో అనుమానం మరింత ఎక్కువవుతుంది. నేరుగా విద్య ఇంటికే బాలు వెళ్తాడు. ఇంట్లో చింటు, సుగుణలతో రోహిణి ఉంటుంది. బాలు డోరు కొట్టడంతో తీయడానికి చింటు వెళ్తాడు. అప్పుడే రోహిణికి విద్య ఫోన్ చేసి బాలు గురించి చెబుతుంది. దీంతో ఆమె ఆందోళన చెందుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోహిణి పరిస్థితి ఏమిటో చూడాలంటే, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.