|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శోభన ప్లాన్ బయటపెట్టిన మీనా- భార్యకు పట్టీలు కొన్న బాలు-మనోజ్ షాపులో దొంగనోట్లు

Published: 27-10-2025, 3:13 AM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శోభన ప్లాన్ బయటపెట్టిన మీనా- భార్యకు పట్టీలు కొన్న బాలు-మనోజ్ షాపులో దొంగనోట్లు

గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మీనా బాలును ఇంట్లో అందరి ముందు ధైర్యంగా సమర్థించింది. రూమ్ నిర్మాణానికి కొత్త ప్లాన్ చెప్పింది. మరోవైపు మనోజ్ షాపులో దొంగనోట్లు బయటపడటంతో కలకలం రేగింది. శోభన ప్లాన్‌ను మీనా ఎలా బయటపెట్టిందో చూడండి.

Key Points

1

మీనా బాలును ఇంట్లో అందరి ముందు సమర్థించి, ఇంటి పరువును నిలబెట్టింది.

2

తాము గది కడతామని శపథం చేసిన మీనా, దానికి కొత్త ఐడియా ఇచ్చింది.

4

శోభన ప్లాన్‌ను మీనా తెలివిగా బయటపెట్టడంతో కథలో మలుపులు చోటుచేసుకున్నాయి.

మీనా: కుటుంబ గౌరవం కోసం నిలబడిన ధీర వనిత

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 27 ఎపిసోడ్‌లో బాలు తాగొచ్చాడని అంతా అంటే.. మీనా అందరికి ఇచ్చి పడేస్తుంది. ఒక్కో మాట చెబుతూ ఇంటిల్లిపాదిని ఏకిపారేస్తుంది. రూమ్ తామే కడతామని శపథం చేస్తుంది మీనా. అందుకు బాలు భయపడుతుంటే కట్టేందుకు కొత్త ఐడియా ఇస్తుంది మీనా. మనోజ్ షాపులో దొంగనోట్లు బయటపడతాయ్.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తాగి ఇంటికి వస్తాడు. సంస్కారానికి ఓ గీత ఉంటుంది. అది దాటితే రౌడీతనం. ఒక ఆడదానితో అమర్యాదగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని బాలుకు చెబుతాడు సత్యం. ఇంతలో అంతా వస్తారు. బాలు మళ్లీ తాగొచ్చాడని ప్రభావతి గొడవ చేస్తుంది.

ఏంటీ ఆవిడ పెద్ద మనసుతో ఇద్దామనుకుందా. మీ కొడుకును తీసుకోలేదని తిడుతున్నారా. అంటే ఎవరో దానం ఇస్తే తీసుకోవాలా. ఏం మాట్లాడుతున్నారా మీరు అని మీనా అంటుంది. ఏయ్ అని ప్రభావతి అరిస్తే.. ఏయ్ ఏంటీ ఏయ్.. ఆవిడ ఏమందో వినలేదా. ఆవిడ డబ్బు ఇస్తే తప్పా కట్టలేరు అంది. అందరి ముందు మనోజ్‌ను అంటే రోహిణి ఊరుకుంటుందా. రవిని అంటే శ్రుతి ఊరుకుంటుందా అని వాళ్లిద్దరిని అడుగుతుంది మీనా.

వాళ్లు ఊరుకోం అంటారు. భర్తను అంటే ముందు నోరు తెరవాల్సింది మీరు. మీరెందుకు ఏం అనలేదు. భర్త గౌరవం పోతుంటే మాట్లాడిసింది మీరా కాదా అని అత్తను నిలదీస్తుంది మీనా . అవును అనుకో అని ప్రభావతి అంటే.. అనుకో ఏంటీ మాట్లాడాల్సిందే. అందరం ఉన్న ఎవరు చేయని పని నా భర్త చేశాడు. ఇంటి పెద్ద గౌరవం వెయ్యి రెట్లు పెంచాడు. ఇంకా నా మొగుడిని అంటారేంటీ అని ఇచ్చి పడేస్తుంది మీనా.

శ్రుతి చెల్లిగా అనుకుని అడుగుతున్నా పుట్టింటి వాళ్ల డబ్బుతో కట్టుకుంటే నీకు గౌరవమా, నీ భర్తకు గౌరవమా. మనకు గౌరవమా అని మీనా అంటుంది. అంత డీప్‌గా ఆలోచించలేదు. నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుందని శ్రుతి అంటుంది. నా భర్త తాగొచ్చి వాగాడా ఏం వాగాడు. తండ్రి కొడితే సైలెంట్‌గా ఉన్నాడు. తాగితే ఇంటి పరువు పోదు. ఇంటి యజమానికి అవమానం జరిగితే పోతుందని రోహిణిని నిలదీస్తుంది మీనా.

మనోజ్ షాపులో దొంగనోట్ల కలకలం

ఇంటి పెద్ద కష్టార్జితాన్ని ఎత్తుకుపోయి పది మందిలో నిలబెడితే పరువు పోతుంది. తల్లి, భార్య డబ్బులివ్వలేదని గుడిలో అడుక్కుంటే పోతుంది. మీకు రూమ్ ఉంది. గడియ పెట్టి మూసుకుని పడుకోండి. బిజినెస్ మ్యాన్ అయితే షాప్‌లో చూసుకోండి. ఇంట్లో ముగ్గురు కొడుకులు సమానమే అని ఏకిపారేస్తుంది మీనా. ఏం రవి మీ అత్తయ్య అలా అంటుంటే నువ్వే అంటే మీ అన్నయ్య జోక్యం చేసుకునే అవసరం వచ్చేది కాదుగా అని మీనా అంటుంది.

అలా ఇంటిల్లిపాదిని ఏకిపారేస్తుంది మీనా. ప్రభావతి నోరెళ్లబెడితే.. నీకు నోరు తెరిచే హక్కు లేదు మూయ్ అని సత్యం అంటాడు. మరోవైపు రాత్రి తండ్రి కొట్టినందుకు బాధగా ఉందని బాలు అంటాడు. ఆడ మగ అనే ఇంగితం లేకపోతే ఎలా అని మీనా అంటుంది. కింద అందరికి క్లాస్ తీసుకున్నావ్. పైన నాకు తీసుకుంటున్నావా అని బాలు అంటాడు.

మాటి మాటికి మా నాన్న నన్ను కొట్టాడు అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతాడు. ఆయన ఎప్పుడు మర్చిపోయారు. మీరే కుండ మోస్తున్నారు. మీరు నార్మల్‌గానే రేసుగుర్రంలా ఉరుకుతారు. తాగితే అంతే. ఆ గొడవలు చూస్తే మావయ్య తట్టుకోగలరా. ఆయన గుండె బలహీనంగా ఉందిగా. ఆయన్ను ప్రశాంతంగా ఉంచాలిగా. ఇంకోసారి తాగి రాకండి అని మీనా అంటుంది.

ఈ కొత్త వేషం ఏంటీ అన్నయ్య రవి అంటాడు. పూజ గురించి అందరూ అడుగుతారు. రాత్రి తాగొచ్చి గొడవ చేసినందుకు పరిహారమేమో అని రోహిణి అంటుంది. అది గొడవ కాదు. పరిహారం చేసేంత తప్పు చేయలేదని మీనా అంటుంది. సత్యం కాళ్లు మొక్కి గొప్పగా చెబుతాడు. మాకు రూమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాకు రూమే వద్దు అని బాలు అంటాడు.

శోభన ప్లాన్‌ను బయటపెట్టిన మీనా

ఇప్పుడు వీడెందుకండి సినిమా చూపిస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. రూమ్ లేకుంటే ఇబ్బంది అవుతుందిగా అని సత్యం అంటాడు. రూమ్ వల్ల వచ్చే గొడవలతో విసిగిపోయాను నాన్నగారు. నాకు వీలైనప్పుడు నా రూమ్ నేనే కట్టుకుంటాను అని బాలు అంటాడు. ఇలాగే నగల గురించి నీ భార్య శపథం చేసింది కదరా అని మనోజ్ అంటాడు.

సరే అమ్మా. వాడి ఒక్కడి వల్లే కాదు నేను కూడా సాయం చేస్తాను అని సత్యం అంటాడు. వద్దు మావయ్య. మీ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా వీళ్లు ఆయన్ను ఎగతాళి చేస్తారు అని మీనా అంటుంది. మంగమ్మా రెండో శపథం చేసింది అని ప్రభావతి ఎగతాళిగా అంటుంది. తొందరపడ్డావేమో మీనా అని సత్యం అంటాడు. మీరు తొందరపడి అప్పు చేయకండి. అది తీర్చడానికి మీరు టెన్షన్ పడాలి అని మీనా అంటుంది.

మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అని సత్యం అంటాడు. తర్వాత ఆవేశం వస్తే శపథం చేయడం మానేయ్. ఇప్పటికీ నగలు కొనలేదు. గోడలు కూడా కడతానో లేదని భయంగా ఉందని బాలు అంటాడు. మీరు తలుచుకుంటే కడతారు. మనం ఇంకో కారు కొందాం. ఆ కారు అద్దెకు ఇద్దాం. వచ్చే అద్దె చిట్టీ కడదాం. ఆ చిట్టి ముందే వాడి రూమ్ కడదాం అని మీనా ఐడియా ఇస్తుంది.

నువ్వు రెండు సార్లు మోస పోయావ్. డబ్బులిచ్చిన వాళ్లు, విజిలెన్స్ అని వచ్చిన వాళ్లు ఇద్దరు మోసగాళ్లే అని ఎస్సై అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మీనా తెలివైన చర్యలు, కుటుంబ గౌరవం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. దొంగనోట్ల వ్యవహారం, శోభన ప్లాన్ కథకు కొత్త మలుపులు తెచ్చాయి. తదుపరి ఎపిసోడ్‌లలో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.