|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: రూ.10 కోట్లు పంపించ‌మ‌న్న జ్యోత్స్న‌-కార్తీక్,దీపను ఇంట్లోకి రావొద్దన్న శివన్నారాయణ

Published: 25-09-2025, 10:56 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: రూ.10 కోట్లు పంపించ‌మ‌న్న జ్యోత్స్న‌-కార్తీక్,దీపను ఇంట్లోకి రావొద్దన్న శివన్నారాయణ

కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న కార్తీక్‌ను రూ.10 కోట్లు డిమాండ్ చేయగా, కార్తీక్ దీపతో కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. అక్కడ వారిని ఇంట్లోకి రావొద్దని శివన్నారాయణ స్పష్టం చేయడంతో కథనం ఆసక్తికరంగా మారింది.

Key Points

1

జ్యోత్స్న కార్తీక్‌ను రూ.10 కోట్లు పంపించమని డిమాండ్ చేసింది.

2

కార్తీక్ శౌర్యకు ఆత్మవిశ్వాసం గురించి చెప్పి, జ్యోత్స్నకు పరోక్ష కౌంటర్ ఇచ్చాడు.

4

అగ్రిమెంట్ గురించి చింతించొద్దని శివన్నారాయణ కార్తీక్‌తో చెప్పాడు.

రూ.10 కోట్లు డిమాండ్ చేసిన జ్యోత్స్న: కార్తీక్‌కు షాక్

కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో మా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు. వాళ్లకు వాళ్ల పేరేంట్స్ హౌం వర్క్ చేయిస్తున్నారు. కానీ మీరు నాకు హోం వర్క్ చేయిస్తున్నారా? ఎప్పుడూ బిజీ. నా ఫ్రెండ్స్ నవ్వారు. నేను స్కూల్ కు ఎలా వెళ్లగలను? నేను స్కూల్ కు వెళ్లను అని శౌర్య అంటుంది. అప్పుడే జ్యోత్స్న నుంచి కార్తీక్ కు కాల్ వస్తుంది.

చెక్ పంపిస్తున్నావా? క్యాష్ పంపిస్తున్నావా? నిన్న మీకు జరిగిన అవమానానికి మీరు ఎలాగో రాలేరనుకో. రాకపోతే రూ.10 కోట్లు కట్టాలి. ఇది మన మధ్య ఉన్న అగ్రిమెంట్. ఎలాగో రావు కాబట్టి అమౌంట్ ఎలా పంపిస్తున్నావో తెలుసుకుందామని కాల్ చేశానని జ్యోత్స్న అంటుంది. మేం రామని చెప్పలేదు కదా అని కార్తీక్ అంటాడు. మీకున్న ఆత్మ గౌరవం వదిలేసి వస్తారా? మీకు జరగకూడని అవమానం జరిగిందని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్నను లైన్ లోనే ఉంచి రౌడీ నువ్వు స్కూల్ కు ఎందుకు వెళ్లకూడదు అంటున్నావని శౌర్యని అడుగుతాడు కార్తీక్ . నా ఫ్రెండ్స్ ఇన్ సల్ట్ చేశారని అంటుంది శౌర్య. మనం పడిపోతే కొంతమంది నవ్వుతారు. మనల్ని ఏడిపించి నవ్వుతారు. మనం నవ్వితే కడుపు మంటతో రగిలిపోతారు. ఓడిపోతే ఆనందిస్తారు. గెలిస్తే గుండెలు బాదుకుంటారు. ఒక దేవుడు అందరికీ నచ్చనప్పుడు నువ్వు నచ్చాలనుకోవడం మూర్ఖత్వం. మూర్ఖులు గురించి పట్టించుకోకుండా చేయాల్సిన పని చేసుకుంటూ పోతా. అర్థమైందా రౌడీ అని జ్యోకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తాడు కార్తీక్.

తప్పు చేస్తే ఒప్పుకోవాలా నాన్న? అయితే అమ్మ తప్పు ఒప్పుకోవాలి కదా. రాత్రి నానమ్మ, పెద్ద నానమ్మ మాట్లాడుకుంటే విన్నానని శౌర్య అంటుంది. తప్పు చేస్తే ఒప్పుకోవాలి. మన నిజాయతీ మనల్ని కాపాడుతుందని కార్తీక్ అనడంతో శౌర్య స్కూల్ కు వెళ్లిపోతుంది. శివన్నారాయణ ఇంటి బయటకు వచ్చి ఎదురు చూస్తుంటాడు. అప్పుడే స్కూటీపై కార్తీక్, దీప వస్తారు.

శౌర్యకు కార్తీక్ జీవిత పాఠం: జ్యోత్స్నకు పరోక్ష కౌంటర్

కార్తీక్, దీపను ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు, వెళ్లిపోమ్మని చెప్తాడు శివన్నారాయణ. నిన్న జరిగిన దానికి ఈ రోజు పనిలోకి రారని అనుకున్నా. మీరు బయల్దేరండని శివన్నారాయణ అంటే, నా భార్య తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నమ్ముతున్నానా లేదా? అనే విషయం పక్కనపెడితే నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. జరిగింది మోయడం మానేస్తున్నా. ఎక్కడిది అక్కడే వదిలేస్తున్నానని శివన్నారాయణ అంటాడు.

అగ్రిమెంట్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. మధ్యలో ఆయన చెప్పింది వినాల్సిందేనని పారిజాతం అంటుంది. అయితే మీ భార్యను ఇంటి దగ్గర దింపేసి నువ్వు రా అని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. అప్పుడే వచ్చిన జ్యోత్స్న.. తాత నీ మాటకు కట్టుబడి వీళ్లు వెళ్లిపోయేలా ఉన్నారు. ఫోన్లో కథలు చెప్పడం కాదు తట్టుకుని నిలబడే ధైర్యం ఉండాలని అంటుంది. మేం ఎవరినీ ఇబ్బంది పెట్టమని కార్తీక్ అంటే సరే మీ ఇష్టం అని శివన్నారాయణ లోపలికి వెళ్లిపోతాడు.

మీ కారణంగా అది తన్నులు తిన్నది. మీ అత్త కొట్టింది. దశరథకు, సుమిత్రకు మధ్య గొడవ జరిగింది. దశరథను జ్యోత్స్న ఓ చిన్న మాట అన్నది. సుమిత్ర లాగిపెట్టి కొట్టింది. ఇదంతా మీ వల్లేరా. ఇంకెన్నాళ్లు ఈ మహా తల్లి ఇంటికి నరకం చూపిస్తుందో చూపించండని పారిజాతం అంటుంది. ఏం తెలియనట్టు వెళ్లి మీ నాన్నకు కాఫీ ఇవ్వు ఏమంటారో చూద్దామని దీపతో కార్తీక్ చెప్తాడు. సుమిత్ర మాటలను గుర్తు చేసుకుంటాడు దశరథ.

దీప, కార్తీక్‌లకు శివన్నారాయణ చేదు నిర్ణయం

ఈ రోజు మీరు రారేమో అనుకున్నా. మా చెల్లి ఎలా ఉందమ్మా? కొన్నింటికి ఎదురు ప్రశ్నలోనే సమాధానం దొరికినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం రాదని దశరథ అంటాడు. మనకు మనమే సమాధానం చెప్పుకోవాలని దీప అంటుంది. ఏం లేదన్న చోట ఏముందో మీకే అర్థమవుతుంది. చెప్పడానికి అర్హత కావాలి. నేను మిమ్మల్ని తండ్రి అనుకుంటే సుమిత్ర తల్లి అవుతుంది. అలాంటి మనిషి భర్తకు ఎందుకు దూరంగా ఉండాలి. చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి కానీ మర్చిపోవాలి. సుమిత్రమ్మ ఎంత నరకం అనుభవించి ఉంటారు. కోపాలు కూడా ఓ సమయం తర్వాత చల్లారిపోవాలని దీప అంటుంది.

నా కారణంగా సుమిత్రమ్మ బాధపడుతుంది. మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అది నాకు ఇష్టం లేదని దీప అంటుంది. భార్యాభర్త అంటే ఒకటే. సుమిత్ర తప్పు చేసింది. నా కోపం భార్య చేసిన తప్పు మీద. భార్య తప్పు చేస్తే భర్త సరిదిద్దడం అవసరం. తన మనసు బంగారం ఇప్పుడు మకిలి పట్టింది. సరిచేయాలంటే వేడి భరించాల్సిందే. నా భార్యను మారుస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని దశరథ అంటాడు.

ఆ మాటలను విన్న సుమిత్ర ఫీల్ అవుతుంది. వెనకాలే ఉన్న జ్యోత్స్న కోపంగా చూస్తుంది. వెళ్లి దీపను ఎందుకు వచ్చావో అడుగు మమ్మీ. నా భర్తకు, నాకు గొడవలు ఎందుకు పెడుతున్నావో అడుగు మమ్మీ. డాడీ దీపను, బావను సపోర్ట్ చేశాడు. డాడీని ఎదురించి మాట్లాడటం నా తప్పే. అందుకు కారణం దీప కాదా? దీప కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని బావకు తెలియదా? వాళ్లంతా ఒకటైపోయారు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. దీప మాట్లాడిన దాంట్లో తప్పులేదని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ పరిణామాలతో కార్తీక్, దీప భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. శివన్నారాయణ కఠిన నిర్ణయం వారిని ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి. జ్యోత్స్న డిమాండ్, కార్తీక్ ఆత్మస్థైర్యం కథనానికి మరింత ఆసక్తిని పెంచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.