|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నాలుగేళ్లకే హన్సిక పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్.. కారణం ఇదేనా?

Published: 11-03-2026, 7:05 AM
షాకింగ్: నాలుగేళ్లకే హన్సిక పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్.. కారణం ఇదేనా?
  • హన్సికా, సోహైల్ కతూరియా విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు!
  • 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో గ్రాండ్ వెడ్డింగ్.. కొద్దిరోజులకే మనస్పర్థలు!
  • భరణం లేకుండా విడాకులు.. ఆర్థికంగా ఎటువంటి సహాయం ఆశించని హన్సిక నిర్ణయం!
  • టాలీవుడ్‌లో ఫుల్ ఫోకస్‌తో హన్సిక.. వరుస చిత్రాలతో బిజీ!

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ పెళ్లి బంధానికి స్వస్తి పలికింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హన్సిక, సోహైల్ విడాకుల ప్రకటన!

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ తన వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా భర్త సోహైల్ కతూరియాతో విడివిడిగా ఉంటున్న ఆమె, తాజాగా ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు పొందారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌ వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరి పెళ్లి మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. జీవనశైలి, వ్యక్తిత్వాల విషయంలో పొంతన కుదరకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని సమాచారం. అయితే పెద్దలు, స్నేహితులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో.. జూలై 2, 2024 నుండి ఈ జంట వేర్వేరుగా నివసిస్తోంది.

చివరకు కలిసి ఉండటం సాధ్యం కాదని గ్రహించి విడాకులు తీసుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీల విడాకుల సమయంలో భరణం విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. కానీ, హన్సిక మాత్రం భర్త నుండి ఎలాంటి భరణం లేదా ఆర్థిక సహాయం ఆశించకపోవడం గమనార్హం. ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేకుండానే ఈ బంధం నుంచి బయటకు రావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న హన్సిక అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. కాగా.. శాకలక బూమ్ బూమ్, కోయి మిల్ గయా వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన హన్సికా, ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ, ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తన ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టింది.

మనస్పర్థలే కారణమా?

భరణం లేకుండా విడాకులు!

హన్సిక విడాకుల వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తదుపరి సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.