
📌 Key Points
- హన్సిక ‘దేశముదురు’ సమయంలో గ్రోతింగ్ హార్మోన్స్ ఇంజెక్షన్లు తీసుకున్నారనే వార్తలను ఖండించారు.
- మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారని హన్సిక అన్నారు.
- దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
- సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు చాలా బాధపడ్డానని హన్సిక తెలిపారు.
హన్సిక మోత్వాని దేశముదురు సినిమా సమయంలో గ్రోతింగ్ హార్మోన్స్ ఇంజెక్షన్లు తీసుకున్నారనే వార్తలను ఖండించారు. మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశముదురు సినిమా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు.
గ్రోతింగ్ హార్మోన్స్ రూమర్స్‌పై హన్సిక క్లారిటీ
Hansika Motwani: హన్సిక మోత్వాని పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనంతరం హీరోయిన్ గా బాలీవుడ్ అలాగే సౌత్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు(Desamuduru) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక(Hansika) మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగు తమిళ భాషలలో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇక తమిళంలో హన్సికకు ఏకంగా అభిమానులు గుడి కట్టారంటే అక్కడ ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతుంది. మెల్ల మెల్లగా హన్సికకు సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో హన్సిక తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
దేశముదురు సినిమాతో ఎమోషనల్ అటాచ్మెంట్
ఈ నేపథ్యంలోనే తన గురించి గతంలో వచ్చిన కొన్ని రూమర్లపై కూడా స్పందించారు.దేశముదురు సినిమా సమయంలో గ్రోతింగ్ హార్మోన్స్(Growthing harmones) ఇంజక్షన్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి నిజమేనా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు హన్సిక సమాధానం చెబుతూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. మీడియా వారికి ఏదైనా కలిసొస్తుందంటే వాళ్ళు దేనినైనా సృష్టించగలరు. నాకు ఇంజక్షన్స్ అంటే చాలా భయం. ఇప్పటికీ ఇంజక్షన్స్ తీసుకునేటప్పుడు ఇంజక్షన్ వేయడం పూర్తి అయ్యేవరకు ఏడుస్తూనే ఉంటానని చెబుతూ ఆ వార్తలను ఖండించారు. దేశముదురు సినిమా సమయంలో ఈమె వయసు కేవలం పదహారేళ్ళు ఈ నేపథ్యంలోనే ఆమె గ్రోతింగ్ హార్మోన్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
దేశముదురు సెట్ లో ఏడ్చాను..
మీడియా సృష్టించే రూమర్స్‌పై హన్సిక ఫైర్
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హన్సిక ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని మీడియా అటెన్షన్ కోసమే ఇలాంటి వార్తలను సృష్టించారని చెప్పారు. ఇక దేశముదురు సినిమా విషయాల గురించి కూడా మాట్లాడుతూ తాను దేశముదురు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాగా ఏడ్చేసానని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సెట్లో అందరూ తనతో చాలా సరదాగా ఉండేవారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి కావడంతో బాదేసిందని ఈ సినిమా తర్వాత మిగిలిన ఏ సినిమా షూటింగ్ సెట్లో ఏడ్చలేదని హన్సిక ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హన్సిక హీరో హీరోయిన్లుగా 2007 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.
హన్సిక తన గురించి వచ్చిన రూమర్స్‌ని ఖండించడమే కాకుండా, దేశముదురు సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా ఇలాంటి వార్తలను సృష్టించడం బాధాకరమని ఆమె అన్నారు.


