|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హన్సిక విడాకులు! దేశముదురు టైంలో అసలు నిజాలు లీక్! ఇంజెక్షన్ల కథ?

Published: 12-03-2026, 7:35 AM
షాకింగ్: హన్సిక విడాకులు! దేశముదురు టైంలో అసలు నిజాలు లీక్! ఇంజెక్షన్ల కథ?
  • హన్సిక, సోహైల్ మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి!
  • దేశముదురు రిలీజ్ టైంకి హన్సిక వయస్సు కేవలం 15 ఏళ్ళు మాత్రమే!
  • తొలి చిత్రంతోనే గ్లామర్ ఒలకబోసి యువతని ఆకర్షించిన హన్సిక
  • సోహైల్ మొదటి భార్య హన్సికకి బెస్ట్ ఫ్రెండ్… ఇది నిజంగా షాకింగ్ ట్విస్ట్!

టాలీవుడ్ లో మరో సంచలనం! హీరోయిన్ హన్సిక తన భర్తతో విడాకులు తీసుకుంది. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

హన్సిక, సోహైల్ విడాకుల వెనుక అసలు కారణాలేంటి?

చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులతో విడిపోయారు. క్రేజీ హీరోయిన్ హన్సిక, ఆమె భర్త సోహైల్ మూడేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. హన్సిక కెరీర్ తో పాటు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఆమె లైఫ్ అనేక మలుపులు తిరిగింది. చిన్న తనంలోనే కోయీ మిల్గయా లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

హీరోయిన్ గా తొలి అవకాశం ఆమెకి అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో దక్కింది. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆమె వయసు ఎంతో తెలుసా ? కేవలం 15 ఏళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. 15 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తొలి చిత్రంతోనే గ్లామర్ ఒలకబోసి యువతని ఆకర్షించింది.

దేశముదురు టైంలో హన్సిక వయస్సుపై సంచలన నిజాలు!

అప్పట్లో హన్సికపై అనేక రూమర్స్ వచ్చాయి. టీనేజ్ వయసులోనే హన్సిక హీరోయిన్ గా అందంగా కనిపించడం కోసం ఆమె తల్లి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చింది అనే ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలని హన్సిక ఖండించింది. కొంత కాలం పాటు హన్సిక యాపిల్ బ్యూటీగా వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఆమె కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. తొలి చిత్రం దేశముదురు, మస్కా, కందిరీగ లాంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో కొన్ని మాత్రమే ఉన్నాయి.

ఆ తర్వాత హన్సికకి హీరోయిన్ గా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో హన్సిక.. తమిళ నటుడు శింబుతో ప్రేమలో పది పెళ్లి వరకు వెళ్ళింది. కానీ వీరి పెళ్లి జరగలేదు. ఆ తర్వాత 2022లో హన్సిక సోహైల్ ని వివాహం చేసుకుంది. ఇది సోహైల్ కి రెండవ పెళ్లి. ట్విస్ట్ ఏంటంటే.. సోహైల్ మొదటి భార్య ఎవరో కాదు హన్సికకి బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి పెళ్లిని హన్సికే దగ్గరుండి చేసింది. కానీ వాళ్లిద్దరూ విడిపోవడంతో హన్సిక సోహైల్ ప్రేమలో పడ్డారు. ఆ విధంగా హన్సిక, సోహైల్ ఒక్కటయ్యారు.

హార్మోన్ ఇంజెక్షన్ రూమర్స్ పై హన్సిక క్లారిటీ!

పెళ్ళైన మూడేళ్ళ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనితో ముంబై లోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. సోహైల్ నుంచి హన్సిక భరణం కూడా రిజెక్ట్ చేసిందట. ఇలా అనేక ట్విస్టులతో హన్సిక జీవితం సాగింది. ప్రస్తుతం హన్సిక వయసు 34 ఏళ్ళు.

హన్సిక జీవితంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా అని ఆశ్చర్యంగా ఉంది కదా! మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.