|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?

Published: 08-05-2025, 5:55 AM
Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం చివరకు పూర్తయింది. తాజాగా, బుక్ మై షో వెబ్‌సైట్‌లో సినిమా రిలీజ్ డేట్ లీక్ అయింది. జూన్ 12, 2025 న విడుదల అవుతుందని సమాచారం.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి.

2

బుక్ మై షోలో సినిమా రిలీజ్ డేట్ 2025 జూన్ 12 గా లీక్.

4

మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు అయిదేళ్ల క్రితం మొదలయి ఎట్టకేలకు ఇటీవలే పూర్తయింది. పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమా సాగుతూ వచ్చింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

బుక్ మై షో లీక్ చేసిన రిలీజ్ డేట్

ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా హరిహర వీరమల్లు సినిమాని మే 30 లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా బుక్ మై షో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ని లీక్ చేసింది. బుక్ మై షోలో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ 2025 జూన్ 12 అని పోస్ట్ చేసింది. జూన్ రెండో వారంలో సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని వార్తలు వచ్చాయి కాబట్టి ఇదే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

అయితే మూవీ యూనిట్ మాత్రం అధికారికంగా హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. మరి బుక్ మై షో పెట్టిన జూన్ 12 నే రిలీజ్ చేస్తారా లేకా ఇంకో కొత్త డేట్ ఇస్తారా చూడాలి.

చివరిగా, బుక్ మై షో లీక్ చేసిన తేదీనే సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి. మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.