|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా.. కారణం అదేనా?

Published: 03-06-2025, 6:20 AM
Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా.. కారణం అదేనా?

Key Points

1

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందా?

2

సినిమా రిలీజ్ డేట్ జూన్ 12 నుండి జూలైకి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు

3

తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు దొరకకపోవడమే వాయిదాకు కారణం అని ప్రచారం

రిలీజ్ డేట్ మార్పులు

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్‌ పెట్టుకుని ఇలా చేస్తున్నారేంటా అని అభిమానులు మళ్లీ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ వాయిదా అని వస్తున్న రూమర్స్ నిజమేనా? వినిపిస్తున్న కారణాలేంటి?

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 2019లో అలా పవన్ ఒప్పుకొన్న సినిమా ఇది. 2020 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. అ‍ప్పటినుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు గత నెలలో పూర్తి చేశారు. తొలుత క్రిష్ దర్శకుడు కాగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే ఇతడు తప్పుకొన్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. క్రిష్ స్థానంలోకి వచ్చారు. ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేశారు.

బయ్యర్ల సమస్య

తొలుత ఈ ఏడాది మార్చిలో వస్తుందని అన్నారు. వాయిదా పడింది. మే 30న రావడం పక్కా అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న వస్తుందని పక్కా ఫిక్సయ్యారు. ఇందుకు తగ్గట్లు మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కూడా ఉందని డేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్లింది. కానీ ఇప్పుడు సడన్‌గా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.

జూలైలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ సంగతేంటి అనేది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ఇలాంటి టైంలో మరోసారి గనక వాయిదా పడితే మాత్రం ఉన్న కాస్త హైప్ కూడా పోయే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

హైప్ తగ్గుదల ఆందోళన

చివరకు ‘హరిహర వీరమల్లు’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. వాయిదాలు సినిమా హైప్‌ను ప్రభావితం చేస్తాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.