
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా తొలిరోజు భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, రెండో రోజు కలెక్షన్స్‌లో 80-85% వరకు తగ్గుదల నమోదైంది. బహిష్కరణ పిలుపు ఈ క్షీణతకు కారణమని భావిస్తున్నారు.
Key Points
హరి హర వీరమల్లు సినిమా రెండో రోజు కలెక్షన్స్ 80-85% పడిపోయాయి.
సినిమాకు బహిష్కరణ పిలుపుతో నిరసనలు జరుగుతున్నాయి.
రెండు రోజుల్లో సినిమా కేవలం రూ. 56.29 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
వర్కింగ్ డే, వర్షాలు మరియు బహిష్కరణ ప్రభావం కలెక్షన్స్ పై పడింది.
హరి హర వీరమల్లు కలెక్షన్స్‌లో భారీ క్షీణత
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా చిత్రం హరి హర వీరమల్లు. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు ఇండియాలో రూ. 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
కానీ, రెండో రోజు అయిన శుక్రవారం హర హర వీరమల్లు కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. ఏకంగా 80 నుంచి 85 శాతం వరకు అన్ని చోట్ల హరిహర వీరమల్లు కలెక్షన్స్ పడిపోయినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. వివిధ భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది.
బహిష్కరణ పిలుపు ప్రభావం
ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం హరి హర వీర మల్లు సినిమాకు శుక్రవారం (జూలై 25) భారతదేశంలో రూ. 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇది మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గుదల ఉంది. ప్రీమియర్ షోల ద్వారా రూ. 12.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.34.75 కోట్ల నెట్ వసూల్లు రాబట్టింది.
2 రోజులను క్రోడీకరించిన సక్నిల్క్.. హరి హర వీరమల్లు మూవీ రెండు రోజుల్లో ఇండియాలో రూ. 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసిందని వెల్లడించింది. రెండో రోజు కేవలం తెలుగులో 24.42 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడంతో పవన్ కల్యాణ్ మూవీ కలెక్షన్స్ శుక్రవారం నిరాశపరిచాయి.
రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు
అయితే, 1684లో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం హరి హర వీరమల్లు జూలై 24న థియేటర్లలో విడుదలై పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ముస్లిం వ్యతిరేక భావాలను సినిమాలో వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో అధికమయ్యాయి.
దీంతో పలు చోట్ల హరి హర వీరమల్లు సినిమాను బహిష్కరించాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. అలాగే, సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ హరి హర వీరమల్లు అని ట్రెండ్ చేస్తున్నారు. వర్కింగ్ డే, వర్షాలు, బహిష్కరణ సెగలతో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు రెండో రోజు కలెక్షన్స్ అమాంతం పడిపోయినట్లు తెలుస్తోంది.
హరి హర వీరమల్లు సినిమాకు బహిష్కరణ, వర్షాలు, వర్కింగ్ డే వంటి అంశాలు ప్రతికూలంగా ప్రభావితం చేశాయని అంచనా. రెండో రోజు కలెక్షన్స్‌లో భారీ తగ్గుదల కనిపించింది.


