
📌 Key Points
- ‘దేవర’ క్లైమాక్స్‌లో సీక్వెల్ హింట్ ఉన్నా, ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు.
- ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్‌లో కూడా ‘దేవర 2’ ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
- కొరటాల శివ బాలకృష్ణతో, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, ‘గాడ్ ఆఫ్ వార్’తో బిజీగా ఉన్నారు.
- ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో ‘దేవర 2’ అసాధ్యంగా కనిపిస్తోంది.
‘దేవర’ సినిమా ఘన విజయం తర్వాత, పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మేకర్స్ నుండి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం, ఎన్టీఆర్, కొరటాల శివ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ‘దేవర 2’ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
దేవర 2 ఆలస్యానికి కారణాలేంటి?
Devara 2 : మొదటి భాగం మాములుగా ఆడితే సీక్వెల్ అని చెప్పినప్పటికీ రాకపోయినా ఫ్యాన్స్ పెద్దగా ఫీలవరు. కాని దేవర సినిమా ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టడం, పైగా సినిమాకి సీక్వెల్ వస్తుందని క్లైమాక్స్ లో హింట్ ఇవ్వడంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు దేవర ఫ్యాన్స్. కాని సినిమా విడుదలై ఇన్ని నెలలవుతున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడం, పైగా ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రత్యేక పోస్టర్‌లో కూడా ‘దేవర 2’ గురించిన కనీస ప్రస్తావన లేకపోవడంతో సినిమా పూర్తిగా పక్కకి పోయిందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. సాధారణంగా సీక్వెల్స్ ఉన్న చిత్రాల విషయంలో ప్రొడక్షన్ హౌస్‌లు చిన్న హింట్ అయినా వదులుతాయి. కానీ ఇక్కడ దేవర మేకర్స్ నుండి ఎలాంటి సౌండ్ లేకపోవడం తారక్ ఫ్యాన్స్ ని ఫుల్ డిసప్పాయింట్ చేసింది.
డ్రాగన్ సినిమా కూడా రెండు భాగాలుగా
అయితే ఈ మొత్తానికి ప్రధాన కారణం దర్శకుడు కొరటాల శివ, హీరో ఎన్టీఆర్ ఇద్దరూ తమ తమ కొత్త ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోవడమే. కొరటాల శివ ఇటీవల నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ చిత్రాన్ని దాదాపు ఖరారు చేసేశారు. ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తే సినిమా పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. మరోవైపు ఎన్టీఆర్ లైనప్ చూస్తే దేవర 2 వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్ జోరుగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ డ్రాగన్ సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.ఆ లెక్కన చూస్తె వచ్చే ఏడాది అంటే 2027 మధ్య వరకు ఎన్టీఆర్ డేట్స్ అస్సలు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు.
ఎన్టీఆర్, కొరటాల బిజీ షెడ్యూల్స్
‘గాడ్ ఆఫ్ వార్’ కూడా లైన్‌లో ఉన్నట్టే
అంతే కాదు.. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా లైన్‌లో ఉన్నట్టే కనిపిస్తుంది. RRR తర్వాత గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తారక్, ఇలాంటి భారీ ఇంటర్నేషనల్ సబ్జెక్టులను వదిలి మళ్లీ దేవర వైపు రావడం ప్రస్తుతానికైతే అసాధ్యంగా కనిపిస్తోంది. కొరటాల శివ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించారని, కథ సిద్ధంగానే ఉందనే లీకులు ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికీ, ప్రాక్టికల్‌గా చూస్తే ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వడం అంత ఈజీ కాదనే చెప్పాలి. బాలకృష్ణ సినిమా ముగించుకుని కొరటాల ఫ్రీ అయ్యేసరికి, అటు ఎన్టీఆర్ తన చేతిలో ఉన్న డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ చిత్రాలను పూర్తి చేసి ఫ్రీ అవ్వాలంటే ఈజీగా రెండేళ్ళు గ్యారంటీ.అంటే ఒకవేళ దేవర 2 గనుక నిజంగానే 2028 మొదట్లోనే మాత్రమే సాధ్యమవుతుంది. అంటే అప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కోల్డ్ స్టోరేజ్ లోనే ఉన్నట్టన్న మాట.
భవిష్యత్తులో దేవర 2 ఉంటుందా?
స్క్రిప్ట్ కే పరిమితమా లేక ఫ్యూచర్లో పట్టాలెక్కుతుందా
ఇక ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌ను ఇంత సుదీర్ఘ కాలం పాటు హోల్డ్‌లో పెట్టడం వల్ల దానిపై ఉన్న క్రేజ్ మరియు హైప్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది కూడా.దీంతో పాటు దేవర ఫస్ట్ పార్ట్ కమర్షియల్‌గా సక్సెస్ అయినప్పటికీ, కథ పరంగా రెండో పార్ట్‌కు అంత స్కోప్ ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొరటాల, ఎన్టీఆర్ తమ మిగతా కమిట్‌మెంట్స్ పక్కన పెట్టి దేవర 2 కోసం టైం కేటాయించడం అంటే దాదాపు అసాధ్యం.కాబట్టి ఈ సీక్వెల్ స్క్రిప్ట్ కే పరిమితం అవుతుందా లేక ఫ్యూచర్లో పట్టాలెక్కుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్‌తో భారీ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ‘దేవర 2’ ప్రస్తుతానికి పక్కన పడినట్లు తెలుస్తోంది. కొరటాల స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా, తారక్ డేట్స్ ఖాళీ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.


