|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Roja షాకింగ్ అనౌన్స్‌మెంట్! చిరుతో రొమాన్స్‌కి రెడీ, బాలయ్య, నాగ్ కి నో! మాస్ సంచలనం!

Published: 22-05-2026, 5:31 PM
Roja షాకింగ్ అనౌన్స్‌మెంట్! చిరుతో రొమాన్స్‌కి రెడీ, బాలయ్య, నాగ్ కి నో! మాస్ సంచలనం!
  • మాజీ మంత్రి రోజా సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధం, ప్రేక్షకులకు అదిరిపోయే వార్త.
  • చిరంజీవితో రొమాంటిక్ పాత్రలు చేసేందుకు రోజా ఓకే చెప్పింది.
  • బాలకృష్ణ, నాగార్జునలతో నటించే విషయంలో రోజా ఆసక్తి చూపలేదు.
  • ‘ఫ్యామిలీ అసెంబ్లీ’ షోలో రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ రోజా రీఎంట్రీ గురించే! తన సంచలన స్టేట్‌మెంట్‌తో సినీ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఏ హీరోలతో నటిస్తుందో, ఎవరికి నో చెప్పిందో తెలుసుకోవాలంటే చదవండి!

రోజా రీఎంట్రీ: మెగాస్టార్‌తో రొమాన్స్‌కి గ్రీన్ సిగ్నల్!

మాజీ మంత్రి, నటి ఆర్కే రోజా ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బుల్లితెరపై మెరుస్తోంది. అడపాదడపా టీవీ షోస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దమే అని హింట్‌ ఇస్తోంది. రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే విషయాన్ని బయటపెట్టింది. చిరంజీవిపై విమర్శలు చేసి, ఆయన్ని అవమానించిన రోజా.. ఇప్పుడు ఆయనతోనే నటిస్తానని ప్రకటించింది. అంతేకాదు బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.

తాజాగా రోజా.. ఫ్యామిలీ అసెంబ్లీ పేరుతో ఓ షో నిర్వహిస్తోంది. సీనియర్‌ జర్నలిస్ట్ జాఫర్‌ యాంకర్‌గా ఈ షో రన్‌ అవుతోంది. జీ తెలుగులో ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇందులో బతుకు జట్కా బండీ తరహాలో ఒక ఎపిసోడ్‌ని నిర్వహించారు. ఇందులో రోజా, విష్ణుప్రియా, పృథ్వీ వంటి వారు పాల్గొన్నారు. అందులో భాగంగా రోజాని పలు ఇంట్రెస్టింగ్‌, కాంట్రవర్షియల్‌ ప్రశ్నలు వేశారు జాఫర్‌. దీనికి రోజా సమాధానాలు క్రేజీగా ఉన్నాయి.

బాలయ్య, నాగ్ లతో నో: సంచలన వ్యాఖ్యలు!

మిమ్మల్ని ఫైర్‌ బ్రాండ్‌ అంటారు, మీకు కోపం ఎప్పుడు వస్తుందని జాఫర్‌ ప్రశ్నంచగా, మీరు ఇంటర్వ్యూ కోసం ఫోన్‌ చేసినప్పుడు కోపం వస్తుందని తెలిపింది. ఇంకా కోపం ఎప్పుడొస్తుందని అడగ్గా, ఆ ఇంటర్వ్యూ ట్రోల్‌ అయినప్పుడు అని, ఇంకా కోపం ఎప్పుడు వస్తుందని అడగ్గా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు అని దిమ్మతిరిగే సమాధానం చెప్పింది రోజా. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ప్రెస్‌ మీట్లలో ఒకలా ఉంటారు, ఇది నిజమా, అది నిజమా అని ప్రశ్నంచగా, దానికి రోజా ఇచ్చిన రియాక్షన్‌ క్రేజీగా ఉంది. మీరు ఎప్పుడు చూసినా ఇలాంటి కాస్ట్యూమ్స్ లోనే ఉంటారు, చూడ్డానికి బాగాలేదు, కాస్ట్యూమ్స్ మార్చొచ్చు కదా అని జాఫర్‌కే ఝలక్‌ ఇచ్చింది రోజా.

టీవీ షోస్‌లో మీరు చాలా మంది జడ్జ్‌ లతో పనిచేశారు. మీ ఫేవరేట్‌ జడ్జ్ ఎవరు అనగా, అనిల్‌ రావిపూడి, సరదాగా, జోవియల్‌గా ఉంటారు, తన లిమిట్స్ లో తాను ఉంటారు, ఆయనతో జడ్జ్ చేయగా చేయడం నచ్చిందని రోజా తెలిపింది. పేరు చెప్పని జడ్జ్‌ గురించి జాఫర్‌ ప్రశ్నించగా, మీరే పేరు చెప్పడానికి భయపడుతున్నారు, నేనేందుకు చెబుతాను అని కౌంటర్‌ ఇచ్చింది రోజా. ఇక ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తే, టాప్‌ హీరోల్లో ఎవరితో నటిస్తారని ప్రశ్నించాడు జాఫర్‌. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ పేర్లు కూడా చెప్పాడు.

‘ఫ్యామిలీ అసెంబ్లీ’లో రోజా హాట్ కామెంట్స్!

దీనికి రోజా రియాక్ట్ అయితే, తాను నటించడానికి ఓకే, వాళ్లు నాతో నటిస్తారో లేదో అని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ అదే ప్రశ్న వేయగా, తాను చిరంజీవితోనే నటించేందుకు ఇష్టపడతాను, ఆయన డాన్సులంటే ఇష్టమని తెలిపింది. ఈ క్రమంలో బాలయ్య మనిషిగా ఇష్టం, కానీ చిరంజీవి పక్కన అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందని తెలిపింది. ఇక నాగార్జున గురించి అడిగితే, నాగార్జునగారికి తాను అభిమానిని అని, ఆయనతో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. వెంకటేష్‌ ప్రస్తావన రాగా, ఆయనతో ఒక్కటే సినిమా చేశాను, పెద్దగా చేయలేదు, ఇంట్రెస్ట్ లేదని వెల్లడించింది. బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ కాదు, చిరంజీవితోనే సినిమా చేస్తానని రోజా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం విశేషం.

రోజా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ఆమె రీఎంట్రీ, హీరోల ఎంపికపై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.