|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరిహర వీరమల్లు కోసం రంగంలోకి బడా హీరో !

Published: 01-07-2025, 6:51 AM
హరిహర వీరమల్లు కోసం రంగంలోకి బడా హీరో !

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారని సమాచారం.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదలవుతోంది.

2

చిరంజీవి హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

4

ఈ సినిమా కోసం చిత్ర బృందం భారీ ప్రచారం చేపట్టనుంది.

హరిహర వీరమల్లు విడుదల తేదీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood) మెగా కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్… ఆ తర్వాత.. ఇండస్ట్రీని షేక్ చేసే హీరోగా మారాడు. ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న హీరోలలో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్

అయితే అలాంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)… హరిహర వీరమల్లు సినిమాతో (Hari Hara Veera Mallu) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జూలై 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం భారీ ప్లాన్స్ వేస్తోంది. క్రిష్ ( kRISH )దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొగల్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.

చిరంజీవి పాత్ర

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ( Chirajeevi) రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం అందుతుంది. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన రాబోతుందని చెబుతున్నారు.

చివరగా, హరిహర వీరమల్లు సినిమా విడుదలకు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రచారం సినిమాకు మరింత ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.