
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. మొదట రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించినా, నెగటివ్ టాక్ పార్ట్ 2 గురించి సందేహాలు రేపుతోంది. నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్ ఇందుకు కారణం.
Key Points
హరి హర వీరమల్లు మూవీకి నెగటివ్ టాక్ వస్తోంది.
పార్ట్ 2 గురించి నిర్మాత ఏఎం రత్నం ఇచ్చిన కామెంట్స్‌తో అనుమానాలు పెరిగాయి.
సినిమా హిట్ అయితేనే పార్ట్ 2 గురించి ఆలోచిస్తామని నిర్మాత వ్యాఖ్య.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి హిస్టారికల్ జానర్ మూవీ ఇది.
నెగటివ్ టాక్ తో పార్ట్ 2 డౌట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు పార్ట్ 1 గురువారం (జులై 24) రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందని మొదట మేకర్స్ చెప్పినా.. తొలి భాగానికి నెగటివ్ టాక్ తో అది వస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.
హరి హర వీరమల్లు మూవీ పార్ట్ 1 రిలీజ్ రోజు మేకర్స్ వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో అభిమానుల హడావిడి చూడటానికి వెళ్లారు. మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఓ ఛానెల్ తో మాట్లాడాడు. రిపోర్టర్ సెకండ్ పార్ట్ సంగతేంటని అడిగారు.
నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్
పార్ట్ 2 ఎప్పుడు అనుకుంటున్నారు.. దాని గురించి చెప్పండని అన్నారు. దీనిపై రత్నం స్పందిస్తూ.. “లేదు.. ఈ సినిమా హిట్ అయిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తాం” అని అనడం గమనార్హం. అతని మాటలు చూస్తుంటే.. మూవీ సక్సెస్ పై మేకర్స్ కు కూడా అనుమానాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
హరి హర వీరమల్లుతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జానర్‌ను టచ్ చేశాడు పవన్ కళ్యాణ్. కంప్లీట్‌గా అతని ఇమేజ్ బేస్ చేసుకొని రూపొందించిన మూవీ ఇది. చరిత్రకు వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌ను జోడిస్తూ దర్శకుడు క్రిష్ ఈ కథను రాసుకున్నాడు. మొఘల్ రాజులు, వారి పాలన గొప్పతనాన్ని గురించే ఎక్కువగా చరిత్రకారులు చెబుతూ వచ్చారు.
హరి హర వీరమల్లు బాక్సాఫీస్ ప్రతిబింబం
మొఘలుల కాలంలోని చీకటి కోణాలను చూపించిన సినిమా ఇది. హిందువులపై మొఘల్ రాజు ఔరంగజేబు సాగించిన అకృత్యాలు, జిజియా పన్ను పేరుతో బలవంతపు మత మార్పిడిలకు ఎలా పాల్పడ్డాడు అన్నది ఆవిష్కరించారు. అంతే కాకుండా కోహినూర్ వంటి విలువైన దేశ సంపదను మొఘలులు ఎలా దోచుకున్నారన్నది టచ్ చేశారు.
మొఘల్ రాజు ఔరంగజేబు అన్యాయాలు, అక్రమాలను ఎదురించడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం యోధుడైన వీరమల్లు సాగించిన పోరాటమే హరిహరవీరమల్లు కథ. హరి హర వీరమల్లు కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను మెప్పించే మూవీ. హిస్టారికల్ క్యారెక్టర్‌లో పవన్ నటన బాగుంది. కథ, వీఎఫ్ఎక్స్ లోపాలు కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వరకు నిలబడుతుంది అన్నది చూడాల్సిందే.
హరి హర వీరమల్లు మొదటి భాగం ఫలితాలే రెండో భాగం నిర్ణయిస్తాయని తెలుస్తోంది. నెగటివ్ టాక్ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.


