|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంత?

Published: 23-07-2025, 11:16 AM
హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంత?

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్, టార్గెట్ కలెక్షన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎంత వసూలు చేయాలని భావిస్తున్నాడో చూద్దాం.

Key Points

1

హరిహర వీరమల్లు చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 126 కోట్లు.

2

తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ 10 కోట్లు.

4

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 35 కోట్లు వచ్చాయి.

హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ బిజినెస్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు చిత్రం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగిసింది. దాదాపు 5 ఏళ్ళ పాటు పలు వాయిదాలతో ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. ఎట్టకేలకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి కాసేపట్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ? ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూళ్లు సాధిస్తే హిట్ అయినట్లు లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు చిత్రానికి 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం లో అత్యధికంగా ఈ చిత్ర హక్కులు 37 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 16.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లకు థియేటర్ రైట్స్ అమ్ముడయ్యాయి. మిగిలిన ఏరియాలు ఈస్ట్ గోదావరిలో 9.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లకు బిజినెస్ జరిగింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్

అదే విధంగా కర్ణాటక, ఇండియాలోని ఇతర ప్రాతాల బిజినెస్ 12 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు టోటల్ బిజినెస్ 126 కోట్లు. అంటే ఈ చిత్రం 127 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ జరిగి హిట్ అయినట్లు. మరి వీరమల్లు ఈ టార్గెట్ అని అందుకుంటాడో లేదో చూడాలి.

అయితే హరిహర వీరమల్లు చిత్రం ఈ టార్గెట్ ని రీచ్ కావడం అంత కష్టమేమి కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే తప్పకుండా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 35 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్

ఈ చిత్ర కథ కోహినూర్ డైమండ్, మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన అరాచకాల నేపథ్యంలో ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ మూవీలో క్లైమాక్స్ లో వచ్చే 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కి తానే కొరియోగ్రఫీ చేసినట్లు పవన్ తెలిపారు.

మొత్తానికి, హరిహర వీరమల్లు సినిమా 127 కోట్లు వసూలు చేస్తే హిట్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి ఈ టార్గెట్ అందుకోవడం సాధ్యమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.