|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమ్ముడు అనిల్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చిన చిరు.. హరీష్ రియాక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Updated: 27-01-2026, 12:10 AM
షాకింగ్: తమ్ముడు అనిల్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చిన చిరు.. హరీష్ రియాక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రూ. 330 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాలీవుడ్ షేక్!
  • అనిల్ రావిపూడికి చిరంజీవి లగ్జరీ రేంజ్ రోవర్ కారును గిఫ్టుగా ఇచ్చిన మెగాస్టార్!
  • హరీష్ శంకర్: అనిల్ కారులో వస్తే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పాట విందాం!
  • ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి త్వరలో సాంగ్ విడుదల కానుందని సమాచారం!

టాలీవుడ్ లో ఒక సంచలనం! చిరంజీవి గారు అనిల్ రావిపూడికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. దీనికి హరీష్ శంకర్ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో చూద్దాం!

చిరంజీవి గిఫ్ట్: అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారు!

Harish- Anil: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు అనిల్ రావిపూడి(Harish- Anil) పేరు మారుమ్రోగిపోతుంది.

అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో అనిల్ రావిపూడి కి మెగాస్టార్ చిరంజీవి లగ్జరీ ‘రేంజ్ రోవర్’ కారును గిఫ్టుగా ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, అదేరోజు జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్ కి కూడా అనిల్ రావిపూడి అదే కారులో రావడం విశేషం.

హరీష్ కామెంట్: పవన్ పాటతో డ్రైవ్ కు వెళ్దాం!

ఇక ఆ ఈవెంట్ అనంతరం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అనిల్. ‘మెగా బహుమతి.. మహదానందం.. మనోధైర్యం.. ధనా ధన్’ అంటూ తన స్టయిల్లో రాసుకొచ్చాడు. ఆలాగే తాను ఈ క్షణాన్ని ఎప్పటికి మర్చిపోలేను అంటూ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాడు అనిల్. అయితే, అనిల్ చేసిన ఈ పోస్ట్ కి మరో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో అనిల్ చేసిన పోస్ట్ కి రిప్లై ఇస్తూ.

ఉస్తాద్ అప్డేట్: త్వరలో పవన్ కళ్యాణ్ సాంగ్ విడుదల!

“తమ్ముడు అనిల్.. త్వరగా ఆ కారేసుకొని నా దగ్గరకు వస్తే.. అందులోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త వింటూ అలా డ్రైవ్ వేద్దాం.. ఇదే నాకు నా గిఫ్ట్” అంటూ రాసుకొచ్చాడు హరీష్ శంకర్. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక హరీష్ చేసిన ఈ పోస్ట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. నెక్స్ట్ సాంగ్ విడుదల కాబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి, అనిల్, హరీష్ ల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.