|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా ప్రపంచంలో సంచలనాలు! బిగ్ అప్‌డేట్స్ మీకోసం..ఫటాఫట్!

Published: 19-03-2026, 4:05 AM
సినిమా ప్రపంచంలో సంచలనాలు! బిగ్ అప్‌డేట్స్ మీకోసం..ఫటాఫట్!
  • వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం, కీర్తి సురేష్ తప్పుకోవడంతో భాగ్యశ్రీ ఎంపిక.
  • అనుష్క శెట్టి ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ మార్చి 31న విడుదల కానుంది, పాన్ ఇండియా స్థాయిలో విడుదల.
  • రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఊహించని ట్విస్ట్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మధ్య బాక్సాఫీస్ పోరు.

టాలీవుడ్‌లో వరుస అప్‌డేట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. వేణు ‘ఎల్లమ్మ’ మూవీతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండగా, అనుష్క ‘కథానార్’ టీజర్ విడుదల కానుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి.

వేణు ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ మార్పు

Updates: వేణు ‘ఎల్లమ్మ’ – డీఎస్పీ ఎంట్రీ.. కీర్తి ఎగ్జిట్! ‘బలగం’తో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’అంటూ రెడీ అయిపోయాడు. ఈ సినిమాతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.అయితే, మొదటగా  హీరోయిన్‌గా అనుకున్న కీర్తి సురేష్.. హీరోగా డీఎస్పీ ఫిక్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. కీర్తి ప్లేస్‌లో ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే దాదాపు ఖరారైనట్లు సమాచారం. దేవిశ్రీ-భాగ్యశ్రీల ఈ ఫ్రెష్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి!

అనుష్క ‘కథానార్’ – జేజమ్మ ఈజ్ బ్యాక్! గతేడాది ‘ఘాటీ’తో నిరాశపరిచిన స్వీటీ.. ఇప్పుడు తన సెంటిమెంట్ ‘హారర్’ జానర్‌తోనే కమ్ బ్యాక్ ఇస్తున్నారు. అదే మలయాళ పీరియడ్ హారర్ ఎపిక్ ‘కథానార్ – ది వైల్డ్ సోర్సరర్’.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ భయంకరంగా ఉంది. మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు టీజర్ గ్లింప్స్ రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో అనుష్క మళ్ళీ గడగడలాడించడం ఖాయం!

అనుష్క ‘కథానార్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన

రామ్ చరణ్ ‘పెద్ది’ – క్లైమాక్స్ ట్విస్ట్ వెనుక మిస్టరీ! ‘ఉప్పెన’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన బుచ్చిబాబు.. ‘పెద్ది’లో అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్లాన్ చేశారట. చరణ్ బల్క్ బాడీ ఫోటోలో కాళ్లు సరిగ్గా కనిపించకపోవడంతో, కథలో ఏదైనా ఫిజికల్ డిజెబిలిటీ ఎలిమెంట్ ఉండబోతుందా? అనే చర్చ నడుస్తోంది.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో ఐదుగురు హీరోయిన్లతో చరణ్ చేసే మాస్ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించబోతోంది. ఏప్రిల్ 30న అసలు లెక్క తేలనుంది!

పవన్ Vs రణ్‌వీర్ – బాక్సాఫీస్ సెంటిమెంట్ రిపీట్? థియేటర్లలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మరియు పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మధ్య పోటీ పీక్స్‌కు చేరింది. గతంలో ‘పంజా’, ‘బ్రో’ టైంలోనూ రణ్‌వీర్ సినిమాలే పైచేయి సాధించాయి. ‘ఉస్తాద్’ కి డివైడ్ టాక్ వస్తుండటంతో.. ముచ్చటగా మూడోసారి రణ్‌వీర్ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేలా కనిపిస్తున్నడంటున్నారు ట్రేడ్ పండిట్స్.

రామ్ చరణ్ సినిమాలో ఊహించని ట్విస్ట్!

ఎన్టీఆర్ బర్త్ డే బ్లాస్ట్ – ‘ఊసరవెల్లి’ రీ-రీలీజ్! మే 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్‌లో మళ్ళీ ‘ఊసరవెల్లి’ మేనియా మొదలవబోతోంది.సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, తారక్ ఎమోషనల్ యాక్షన్ మళ్ళీ వెండితెరపై చూడటానికి నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లను బుక్ చేసుకునే పనిలో పడ్డారు. ఉగాది వేళ వచ్చిన ఈ గుడ్ న్యూస్ ఇపుడు తారక్ ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేస్తుంది .

మొత్తానికి ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు నెలకొననుంది. ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.