
📌 Key Points
- రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
- హరీష్ శంకర్ రవితేజకు ‘మాస్ మహారాజా’ బిరుదును తానే ఇచ్చానని తెలిపారు.
- రవితేజ పేరు ముందున్న ‘మాస్ మహారాజా’ ట్యాగ్ తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హరీష్ అన్నారు.
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ ‘మాస్ మహారాజా’ బిరుదు గురించి మాట్లాడారు. ఆ బిరుదును తానే ఇచ్చానని ఆయన అన్నారు.
రవితేజ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హరీష్
BMW Pre release: రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే రవితేజతో పాటు దర్శకుడు, హీరోయిన్లు కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు రవితేజతో పని చేస్తున్న దర్శకులు కూడా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా హాజరయ్యారు. హరి శంకర్ రవితేజ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. రవితేజను అందరూ మాస్ మహారాజా అంటూ పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిరుదు గురించి కూడా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇటీవల రవితేజ సినిమాలకు మాస్ మహారాజా అనే ట్యాగ్ తీసేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఆ ట్యాగ్ తీసేసే రైట్స్ ఎవరికీ లేవని అందుకు సంబంధించిన హక్కులన్నీ నా దగ్గరే ఉన్నాయని హరీష్ శంకర్ తెలిపారు. ఎందుకంటే రవితేజ అన్నయ్యకు మాస్ మహారాజ అనే పేరు పెట్టింది తానే కాబట్టి ఆ హక్కులని నాకు మాత్రమే సొంతమని ఈయన తెలియజేశారు. ఒక సినిమా వేడుకలో భాగంగా రవితేజకు హరీష్ శంకర్ ఈ బిరుదు ఇచ్చారని తెలుస్తోంది.
‘మాస్ మహారాజా’ బిరుదు గురించి హరీష్ కామెంట్స్
హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షాక్ ఈ సినిమా ఈవెంట్ సమయంలో హరీష్ శంకర్ రవితేజ గారిని వేదికపైకి ఆహ్వానించే సమయంలో మాస్ మహారాజా అంటూ ఆహ్వానించాలని తెలియజేశారట. ఇలా ఈ కార్యక్రమంలో రవితేజకు హరీష్ శంకర్ మాస్ మహారాజా అనే బిరుదు ఇవ్వటం వల్ల ఈ పేరుకు సంబంధించిన హక్కులని తన వద్ద ఉన్నాయి అంటూ తాజాగా హరీష్ శంకర్ మాట్లాడారు. ఇటీవల కాలంలో హీరోలు తమ పేరు ముందు ఉన్న ట్యాగ్స్ తొలగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవితేజ కూడా మాస్ మహారాజా అనే ట్యాగ్ తీసేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
సంక్రాంతి హిట్ అందించేనా…
సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రవితేజ
ఇక రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఈయన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల యాక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రవితేజ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.


