
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్‌పై ట్రోల్స్ – స్పందించిన హరీష్ శంకర్!
- నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోనని తేల్చి చెప్పిన డైరెక్టర్!
- పవన్ కళ్యాణ్ సినిమాపై విమర్శలు చేసిన వారిపై ఫైర్!
- బ్లాక్ చేస్తా లేదా కంప్లైంట్ ఇస్తా – హరీష్ వార్నింగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ట్రోల్స్‌పై హరీష్ శంకర్ సీరియస్ కామెంట్స్!
Harish Shankar On Ustaad Bhagat Singh Trolls: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడం, సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. పనికిమాలిన ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని, బూతులు మాట్లాడితే కంప్లైంట్ చేస్తానని తేల్చి చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సృష్టిస్తున్న సునామీ ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది.
నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోనన్న డైరెక్టర్!
పాన్ ఇండియా స్థాయిలో ‘ ధురంధర్ 2 ’ రికార్డులు తిరగరాస్తుండటంతో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా స్పందించారు.
“ఉదాహరణకు.. ‘ఫలానా సీన్ ఇంకా బాగా రాయాల్సింది’ లేదా ‘ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా ఉంది’ అని చెబితే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను. అంతేకానీ, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ట్రోల్స్‌ను నేను సీరియస్‌గా తీసుకోను. తమ అడ్రస్ కూడా చెప్పుకోలేని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు” అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
కంప్లైంట్ ఇస్తా.. ట్రోలర్స్‌కి హరీష్ వార్నింగ్!
“నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు మా తల్లిదండ్రులే నన్ను ట్రోల్ చేశారు. నువ్వు డైరెక్టర్ అవ్వగలవా? అని అడిగారు. కాబట్టి ఇవన్నీ నాకు కొత్తేమీ కాదు. ఎవరైనా బూతులు వాడినా లేదా హద్దులు దాటినా వెంటనే బ్లాక్ చేస్తాను లేదా కంప్లైంట్ ఇస్తాను. ఎన్నో అడ్డంకులను దాటి ఈ సినిమాను థియేటర్ల దాకా తీసుకువచ్చినందుకు నేను సక్సెస్ అయ్యాననే భావిస్తున్నాను” అని ఉస్తాద్ భగత్ సింగ్ తెలిపారు.
హరీష్ శంకర్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించిన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.


