
📌 Key Points
- హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విజయంపై నమ్మకంగా ఉన్నారు, కానీ ఫలితంపై అనుమానాలు ఉన్నాయి.
- ‘మిస్టర్ బచ్చన్’ వైఫల్యం తర్వాత కూడా హరీష్ వైఖరి మారలేదని విమర్శలు వస్తున్నాయి.
- చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపిస్తానని హరీష్ చేసిన ప్రకటనలు మెగా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తేడా కొడితే, చిరంజీవి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమని విశ్లేషణలు వస్తున్నాయి.
దర్శకుడు హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విజయంపై ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే, చిరంజీవితో సినిమా తీసే అవకాశం కోసం ఆయన అతిగా ఆశపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ నమ్మకం అతివిశ్వాసమా?
Hareesh Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. రేపే విడుదల కాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద ఆయన చూపుతున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. అది ‘అతివిశ్వాసమా?’ లేక నిజంగానే కంటెంట్ ఉందా? అన్న అనుమానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘మిస్టర్ బచ్చన్’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా హరీష్ తీరు మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘ఉస్తాద్’ గట్టెక్కుతుందా? లేక ముంచుతుందా? బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్ ది రివెంజ్’ లాంటి గట్టి పోటీ ఉంది. పైగా సోషల్ మీడియాలో ‘ఓజి’ (OG)కి ఉన్నంత క్రేజ్ ఉస్తాద్‌కి లేదన్నది నగ్న సత్యం. ఏపీ, ఓవర్సీస్‌లో పడబోయే ఎర్లీ మార్నింగ్ బెన్ ఫిట్ షోలే హరీష్ భవిష్యత్తును తేల్చేయనున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నా.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ కలెక్షన్లు రాకపోతే హరీష్ కెరీర్ డేంజర్ జోన్‌లో పడటం ఖాయం.
చిరంజీవిని టార్గెట్ చేస్తున్న హరీష్
చిరంజీవిని టార్గెట్ చేస్తున్న హరీష్.. ఇది సాధ్యమేనా? ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి వింటేజ్ చిరుని చూపిస్తానని హరీష్ పదే పదే చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మొహమాటం కొద్దీ మెహర్ రమేష్‌కు అవకాశం ఇచ్చి చిరంజీవి ఎంత పెద్ద తప్పు చేశారో ఆయనకు తెలుసు. ఇప్పుడు హరీష్ విషయంలో కూడా అదే రిస్క్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం చూశాక, కేవలం మాస్ డైలాగులు రాసినంత మాత్రాన చిరు సినిమా ఇచ్చేస్తారా? అంటే అనుమానమే.
2028 దాకా వెయిటింగ్ లిస్టే! ఒకవేళ ‘ఉస్తాద్’ బ్లాక్ బస్టర్ అయినా.. చిరంజీవి లైనప్ చూస్తుంటే హరీష్‌కు ఇప్పట్లో ఛాన్స్ దొరికేలా లేదు.ఇప్పటికే మెగా 158 బాబీతో, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇక అవి అవ్వాలంటే రెండేళ్ళు గ్యారంటీ. మరో వైపు హరీష్ ఇతర హీరోలతో సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకున్నాడన్న టాక్ ఉంది . మరి ఇప్పుడు చిరు కోసం 2028 దాకా వెయిట్ చేస్తారా? లేక హరీష్ కేవలం హైప్ కోసం ఈ మాటలు చెబుతున్నారా? అన్నది హాట్ టాపిక్.చూస్తుంటే హరీష్ శంకర్ ఖచ్చితంగా ‘అతి’గా ఆశపడుతున్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ మాత్రం తేడా కొట్టినా.. చిరంజీవి అపాయింట్‌మెంట్ దొరకడం హరీష్‌కు కలగానే మిగిలిపోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు!
హరీష్‌కు చిరు అవకాశం దొరుకుతుందా?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ విజయం హరీష్ శంకర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ సినిమా ఆశించిన ఫలితం రాకుంటే, చిరంజీవితో సినిమా తీసే అవకాశం కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.


