
📌 Key Points
- రష్మిక మందన్న గత మూడు సంవత్సరాలుగా వరుస సినిమాలతో పాపులారిటీ సంపాదించింది.
- చిన్న వయసులోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక ఒకప్పుడు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది.
- కెరీర్ కోసం పెళ్లిని రద్దు చేసుకున్న రష్మిక నిర్ణయం సంచలనం సృష్టించింది.
- రష్మిక తన నిర్ణయంతో సమాజం నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తన లక్ష్యాన్ని సాధించింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె సక్సెస్ స్టోరీ వైరల్ అవుతోంది. రష్మిక తన కెరీర్ కోసం పెళ్లిని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చివేసింది.
రష్మిక మందన్న సినీ ప్రస్థానం
HBD Rashmika:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) గత మూడు సంవత్సరాలుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. 30 ఏళ్లు కూడా నిండకుండానే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రష్మిక మందన్న.. నాడు తన జీవితంలో తీసుకున్న డేరింగ్ స్టెప్.. నేడు ఆమె జీవితాన్నే మార్చేసింది. అంతేకాదు ఆ నిర్ణయమే నేడు ఆమెకు ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను అందించింది అని చెప్పవచ్చు.. మరి రష్మిక మందన్న తీసుకున్న ఆ డేర్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఒకప్పుడు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఆమె పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె సినిమాల నుండి ఆమె పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేస్తూ చిత్ర బృందాలు ఆమెకు స్పెషల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే రష్మిక మందన్న తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది .
రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమాయణం
అసలు విషయంలోకి వెళ్తే.. రష్మిక మందన్న నేడు ఈ స్థాయికి రావడానికి కారణం నాడు తీసుకున్న ఆ నిర్ణయమే.. కన్నడ సినిమాలలో నటిస్తున్నప్పుడే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కొన్ని నెలల్లో పెళ్లి అనగా రష్మిక మనసు మారిపోయింది . తన గ్లామర్, టాలెంట్ పై ఉన్న నమ్మకంతో హీరోయిన్గా ఎదగాలి.. పెళ్లి చేసుకుంటే కలలు నెరవేరవని అర్థం చేసుకుంది. ఏదైనా కానీ, ఎవరు ఏమైనా అనని.. పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక అదే విషయాన్ని రక్షిత్ తో చెప్పింది .కానీ అతడు ఒప్పుకోలేదు. అయితే తనకు మాత్రం కెరియర్ ముఖ్యమని పెళ్లి చేసుకోలేనని నిర్మొహమాటంగా, చాలా ధైర్యంగా రక్షిత్ తో తన అభిప్రాయాన్ని పంచుకుంది రష్మిక. సాధారణంగా పెళ్లి ఆగిపోయింది అంటే సమాజంలో చిన్న చూపు.. ఎన్నో రూమర్లు .. గాసిప్స్ కూడా పుట్టుకొస్తాయి.. కానీ రష్మిక అవేవీ పట్టించుకోలేదు. పైగా రక్షిత్ ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దాంతో రక్షిత్ – రష్మిక పెళ్లి రద్దయింది. అప్పట్లో ఆ వార్త శాండిల్ వుడ్ మీడియాని షేక్ చేసింది.
కెరీర్ కోసం పెళ్లిని రద్దు చేసుకున్న రష్మిక
రక్షిత్ అభిమానులు రష్మికపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది. అయితే ఆ సమయంలో రక్షిత్ గొప్ప మనసు చేసుకొని ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని, ట్రోల్స్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇక అనుకున్నట్టుగానే ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అలా మొదటి సినిమా ఛలో సూపర్ హిట్ అయింది.. గీతగోవిందం బ్లాక్ బస్టర్.. సరిలేరు నీకెవ్వరు రికార్డ్స్ .. భీష్మ, పుష్ప, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె కెరియర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆమె ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రక్షిత్ తో పెళ్లి రద్దు నిర్ణయం నేడు ఆమె కెరియర్నే మార్చేసింది. అంతేకాదు తెలుగు చిత్రాలతో నేడు పాన్ ఇండియా స్థాయి పేరు దక్కించుకొని .. తెలుగు సినిమాలతో జపాన్ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా నాడు తీసుకున్న ఆ డేరింగ్ స్టెప్ నేడు ఆమె జీవితాన్ని ఉన్నతంగా మార్చేసింది అనడంలో సందేహం లేదు.
చివరిగా, రష్మిక మందన్న తన కెరీర్‌ను ఎంచుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.


