
📌 Key Points
- కలర్స్ స్వాతి ‘డేంజర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’తో గుర్తింపు, ‘అష్టా చెమ్మా’తో హీరోయిన్‌గా ఎంట్రీ.
- తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
- “పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్” అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్.
కలర్స్ స్వాతి పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ బంధాలు, నమ్మకాలపై ఆమె బోల్డ్‌గా పంచుకున్న అభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె సినీ ప్రస్థానం, తాజా కామెంట్స్ వివరాలు ఇక్కడ.
కలర్స్ స్వాతి సినీ ప్రస్థానం
Swathi Comments : స్వాతి… ఈ పేరు వింటే ఎవరా అనే ఆలోచనలో పడతారేమో కాని కలర్స్ స్వాతి అనగానే గుర్తు పట్టని మూవీ లవర్ ఉండడంటే ఆశ్చర్యం లేదు. అలా బుల్లితెరపై ‘కలర్స్’ షోతో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తన అల్లరితో, చలాకీతనంతో అందరి మనసులు దోచేసుకున్న ఈ తెలుగమ్మాయి, వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక నటి సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ స్వాతిరెడ్డి మాత్రం తన విలక్షణమైన నటనతో, సహజసిద్ధమైన ఎక్స్ ప్రెషన్స్ తో టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుందనే చెప్పాలి.
నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా
సినిమాల విషయానికే వస్తే ..క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘డేంజర్’ సినిమాతో స్వాతి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2007లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో చెల్లెలిగా నటించి, తన కామెడీ టైమింగ్‌తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన మైలేజ్‌తో 2008లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చెమ్మా’ సినిమాతో హీరోయిన్‌గా మారి నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది కూడా.
పెళ్లి బంధంపై స్వాతి బోల్డ్ కామెంట్స్
ఆ తర్వాత ‘కలవరమాయే మదిలో’, నిఖిల్‌తో చేసిన ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి విభిన్నమైన సినిమాలతో విజయాలను అందుకుంది. హారర్ థ్రిల్లర్ ‘త్రిపుర’ సినిమాలోనూ అలరించిన స్వాతి, కొంతకాలం గ్యాప్ తర్వాత 2023లో ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్
ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో అలాగే ఇంటర్వ్యూలలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వాతి తన వ్యక్తిగత జీవితం, పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎంత సున్నితంగా మారిపోతున్నాయో, మనుషుల మధ్య నమ్మకం ఎలా సడలిపోతుందో ఆమె చాలా బోల్డ్‌గా పంచుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
ఈ తరం సెంటిమెంట్లు, మారుతున్న జీవనశైలిని ప్రతిబింబిస్తూ స్వాతి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషిని పూర్తిస్థాయిలో నమ్మి, వివాహం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండటం అనేది ఒక పెద్ద టాస్క్‌లా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో ఎవరికీ కూడా కొంచెం కూడా ఓపిక, సహనం ఉండడం లేదని పెదవి విరిచింది. ఒక ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతని అలవాట్లకు సర్దుకుపోతూ, ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
ఒక కుక్కను పెంచుకోవడం ఎంతో ఉత్తమం
పెళ్లి చేసుకుని రోజూ టెన్షన్ పడడం కంటే, హాయిగా ఎటువంటి చింత లేకుండా ఒక కుక్కను పెంచుకోవడం ఎంతో ఉత్తమమని స్వాతిరెడ్డి ఒక క్రేజీ సజీషన్ ఇచ్చింది.మనుషులతో పోలిస్తే మూగజీవాలు చూపించే ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని, ఒక కుక్క మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని తెలిపింది. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా మనల్ని ప్రాణంగా ప్రేమిస్తుందని, అందుకే మానసిక ప్రశాంతతకు పెళ్లి కంటే పెట్ యానిమల్సే బెటర్ అంటూ స్వాతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. చూడాలి మరి బోల్డ్ గా వదిలిన ఈ కామెంట్స్ పై మగ మహానుభావులు ఎలా రియాక్ట్ అవుతారో !
స్వాతిరెడ్డి చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు నేటి తరం ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. మారుతున్న జీవనశైలిలో వివాహ బంధాలపై పెరుగుతున్న సందేహాలకు ఆమె మాటలు అద్దం పడుతున్నాయి.

