|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు అలాంటి భర్త కావాలి.. హేబా పటేల్ టేస్ట్ అస్సలు ఊహించరు, పెళ్లిపై క్లారిటీ

Published: 05-07-2025, 9:26 AM
నాకు అలాంటి భర్త కావాలి.. హేబా పటేల్ టేస్ట్ అస్సలు ఊహించరు, పెళ్లిపై క్లారిటీ

కుమారి 21ఎఫ్ సినిమాతో పేరు తెచ్చుకున్న హేబా పటేల్, తాజా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు భర్త ఎలా ఉండాలో, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

హేబా పటేల్ తన భవిష్యత్ భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా హీరో శశికుమార్ లాంటి వ్యక్తి తనకు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

4

కుమారి 21ఎఫ్ రీ-రిలీజ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

హేబా పటేల్ ఆదర్శ భర్త

`కుమారి 21ఎఫ్‌` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది హేబా పటేల్‌. ఈ మూవీతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. బోల్డ్ గా నటించి మెప్పించింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది.

ఆ సమయంలో హేబా పటేల్‌కి యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉండేది. టీనేజర్స్ మాత్రం ఆమెకి ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్స్ తో ఆకట్టుకుంది హేబా పటేల్‌. క్రేజీ హీరోయిన్‌గా మారింది.

కానీ మధ్యలో కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది హేబా. ఆ గ్యాప్‌ ఆమె కెరీర్‌కి దెబ్బగా మారింది. ఆఫర్లు రాలేదు, దీంతో సినిమాల పరంగానూ గ్యాప్‌ వచ్చింది.

మళ్లీ ఇప్పుడు సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో ఆకట్టుకుంటుంది. బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది హేబా పటేల్‌.

`కుమారి 21 ఎఫ్‌` మూవీ ఈ నెల 10 రీ రిలీజ్‌ కాబోతుంది. ఈ మూవీ కోసం హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి ఆమె ఇంటర్వ్యూలిచ్చింది. ఇందులో తనకు ఎలాంటి భర్త కావాలో వెల్లడించింది.

పెళ్లిపై హేబా అభిప్రాయాలు

ఐడిల్‌ బ్రెయిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారని యాంకర్‌ ప్రశ్నించగా, ఆలోచనలో పడ్డ హేబా పటేల్‌.. ఆ తర్వాత సినిమాలోని పాత్రతో వర్ణించింది.

ఇటీవల తమిళంలో `టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీ చూసినట్టు చెప్పింది. ఈ మూవీలోని హీరో శశికుమార్‌ లాంటి భర్త కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఆయనలా రెస్పాన్సిబులిటీ, కేరింగ్‌ తీసుకునే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింద హేబా.

మామూలుగా ఎవరైనా స్టార్‌ హీరో, యంగ్‌ హీరో పేరు చెబుతుంటారు. కానీ అనూహ్యంగా హేబా శశికుమార్‌ పేరు చెప్పడం ఆశ్చర్యంగా మారింది.

ఇక పెళ్లి గురించి చెబుతూ, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని తెలిపింది. ఏజ్‌ వచ్చింది, మ్యారేజ్‌ చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకోను అని, ఎవరైనా అబ్బాయిని చూసినప్పుడు, అతను బాగా నచ్చినప్పుడు,

కుమారి 21ఎఫ్ రీ-రిలీజ్

ఆయన్ని మ్యారేజ్‌ చేసుకోవాలి అనే ఫీలింగ్‌ మనసులో కలిగినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని, అంత వరకు పెళ్లి జోలికి వెళ్లను అని తెలిపింది హేబా పటేల్‌. ఆ ఫీలింగ్‌ కలిగేంత వరకు మ్యారేజ్‌పై ఆసక్తి లేదని వెల్లడించింది.

`అలా ఎలా` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన హేబా పటేల్‌ `కుమారి 21 ఎఫ్‌` చిత్రంతో బ్రేక్‌ అందుకుంది. ఇక వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది.

`ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్`, `మిస్టర్‌`, `అంధగాడు`, `ఏంజెల్‌`, `24 కిసెస్‌`, `ఒరేయ్‌ బుజ్జిగా`, `ఓడెల రైల్వే స్టేషన్‌`, `శాసనసభ`, `హనీమూన్‌ ఎక్స్ ప్రెస్‌`, `ధూమ్‌ ధామ్‌`, `ఓడెల 2` వంటి చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ మూవీ చేస్తుంది. వీటితోపాటు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తూ బిజీగా ఉంది హేబా పటేల్‌.

చివరగా, హేబా పటేల్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి, తన ఆదర్శ భర్త ఎలా ఉండాలో వివరించారు. ప్రస్తుతానికి పెళ్లిపై ఆమెకు ఆసక్తి లేదని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.