
📌 Key Points
- నటి హేమ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
- బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమ పేరు బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
- కోర్టు హేమకు క్లీన్ చిట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
- గతంలో జరిగిన డ్రగ్స్ కేసును గుర్తు చేసుకుంటూ హేమ భావోద్వేగంగా మాట్లాడారు.
ప్రముఖ నటి హేమ గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో తన పేరును చేర్చడం తనను మానసికంగా కుంగదీసిందని ఆమె వాపోయారు. దీనిపై ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
హేమ ఎమోషనల్ కామెంట్స్
Hema: ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది నటీమణులలో హేమా (Hema ) కూడా ఒకరు. అమ్మ, అక్క, చెల్లి, వదిన, అత్త ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తన జీవితంలో ఆరోజు ఎప్పటికీ మర్చిపోలేనిదని, మానసికంగా తనను కొంతమంది ఇబ్బంది పెట్టారు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది. విషయంలోకి వెళ్తే రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఈ కేసులో పలువురు తెలుగు వ్యక్తుల పేర్లు వినిపించడంతోపాటు సీనియర్ నటి హేమ పేరు కూడా బయటకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అనంతరం హేమాకి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ వివాదం కాస్త క్రమంగా సద్దుమణిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.. ఇకపోతే ఇప్పుడు తెలంగాణలో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ పాత కేసును ప్రస్తావిస్తూ తాజాగా హేమ ఎమోషనల్ కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో బెంగళూరులో జరిగిన డ్రగ్స్ కేసును గుర్తు చేసుకుంటూ హేమ ఇలా చెప్పుకొచ్చింది. మే 19 2024న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జి ఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకే పోలీసులు మే 20 తెల్లవారుజామున దాడులు చేపట్టారు. ఆ సమయంలో మొత్తం 88 మందిపై కేసులు నమోదు చేయగా.. వారిలో 9 మంది నిర్వాహకులు, మిగిలిన వారిపై డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణల కింద కేసు నమోదు అయింది..
బెంగళూరు డ్రగ్స్ కేసు వివరాలు
ముఖ్యంగా నాతో పాటు 79 మంది డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో పోలీసులు కోర్టులో 1000కి పైగా పేజీలతో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో నేను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని చెప్పినప్పటికీ నాపై ఎక్కువగా ఆరోపణలు కొనసాగాయి. కారణం నేనొక సెలబ్రిటీ. కొన్ని మీడియా సంస్థలు నాపై వచ్చిన ఆరోపణలను పదే పదే ప్రసారం చేసినప్పటికీ.. తర్వాత నేను నిర్దోషిని అని తేలిన విషయాన్ని మాత్రం ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు” అంటూ విమర్శలు గుప్పించింది.
కోర్టు క్లీన్ చిట్
2025 జనవరి 2న బెంగళూరు కోర్టు నా వాదనలు పరిశీలించి నేను డ్రగ్స్ వినియోగించలేదని తేల్చి నాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. దీంతో నేను నిర్దోషినని న్యాయపరంగా నిరూపితమైంది ..కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో నన్ను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఎన్నోసార్లు నేను నా తప్పు లేదని చెప్పినా సరే ఎవరూ నమ్మలేదు.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిజం బయటపడింది. డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయితేనే దోషులని భావించడం సరైనది కాదు.. జైలుకు వెళ్ళినంత మాత్రాన ఎవరూ నేరం చేసినట్టు కాదు.. దయచేసి ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు.. ఆ నరకం నుండి ఆ బాధ నుండి నేను ఇప్పటికి బయటపడలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హేమ. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హేమ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. డ్రగ్స్ కేసు తనను మానసికంగా ఎంతగానో బాధించిందని ఆమె అన్నారు. ఈ వివాదం ఆమె జీవితంలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోయింది.


