
📌 Key Points
- హే బల్‌వంత్ మూవీతో సుహాస్ ఫాస్ట్ రీఎంట్రీ! ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం!!
- తమిళంలో విలన్ గా సుహాస్ సంచలనం! మందాడి మూవీతో మరో ఎంట్రీకి రంగం సిద్ధం!!
- కార్తీక్ సుబ్బరాజు బ్యానర్‌లో సుహాస్ మూవీ! త్వరలోనే ఫైలన్ కానున్నట్లు ప్రకటన!!
- ‘అంబాజీపేట’ చూసి సుహాస్‌కు ఆఫర్! తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉందని కామెంట్!!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ ఇప్పుడు తమిళంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ‘హే బల్‌వంత్’ మూవీతో తన కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
ఫిబ్రవరి 20న ‘హే బల్‌వంత్’ రిలీజ్!
డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న సుహాస్ ఇప్పుడు ‘హే బల్‌వంత్’తో రాబోతున్నాడు. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై గోపీ అచ్చర తెరకెక్కించిన ఈ మూవీ ఫబ్రవరి 20న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించాడు హీరో సుహాస్. ‘భగవాన్ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. ‘హే బల్‌వంత్’ సినిమా కూడా ఎంతో క్వాలిటీగా ఉంటుంది. నా కెరీర్‌లో మళ్లీ ఇంత ఫాస్ట్‌గా సినిమా జరుగుతుందా అనిపించింది. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యాను.
సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా ఉంది. కచ్చితంగా నాకు విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది. వరుస ఫెయిల్యూర్స్ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి చేయమని అన్నారు., ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్ ఇచ్చి హే బల్‌వంత్ చేశాను’ అన్నారు. ఇక తమిళ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘మందాడిలో మెయిన్ విలన్ క్యారెక్టర్. ఆ సినిమా రిజల్ట్ తర్వాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్ చేసిన లుక్ అండ్ క్యారెక్టర్. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. ఇక వీటితో పాటు కార్తీక్ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. త్వరలోనే ఫైలన్ అవుతాయి’ అని చెప్పుకొచ్చాడు.
తమిళంలో విలన్‌గా సుహాస్ ఎంట్రీ!
కార్తీక్ సుబ్బరాజుతో సినిమా!
సుహాస్ కెరీర్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


