|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విక్రమ్ సంచలనం: ఒకేసారి నాలుగు సినిమాలు! ఈ స్పీడ్ వెనుక అసలేముంది?

Published: 22-02-2026, 5:05 AM
విక్రమ్ సంచలనం: ఒకేసారి నాలుగు సినిమాలు! ఈ స్పీడ్ వెనుక అసలేముంది?
  • విక్రమ్ ఒకేసారి నాలుగు చిత్రాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
  • విక్రమ్ నటుడు మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని నిరూపించుకున్నారు.
  • గిటార్, పియానో వాయించడంలో విక్రమ్ ప్రతిభ కనబరుస్తారు.
  • విక్రమ్ తండ్రి నటుడు కావాలనుకున్నా, ఇంజనీర్గా స్థిరపడ్డారు.

ప్రముఖ నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

విక్రమ్ లైనప్ విడుదల చేసిన ప్రకటన

Hero Vikram:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్(Vikram ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న విక్రమ్.. ఒకవైపు హీరోగా, మరొకవైపు ప్లే బ్యాక్ సింగర్ గా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. శివపుత్రుడు తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఈయన.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో తంగలాన్, వీరధీరశూరన్ వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం లభించలేదు. అయితే ఈ ఏడాది మాత్రం విక్రమ్ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకేసారి నాలుగు చిత్రాలను ప్రకటించి.. అటు అభిమానులను సినీ ప్రియులను కూడా ఆశ్చర్యపరిచారు విక్రమ్. ఈ మేరకు తన అప్ కమింగ్ సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా ఒక ఆసక్తికరమైన పోస్ట్ కూడా పంచుకున్నారు.

విక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

విక్రమ్ తన అధికారిక ఖాతా ద్వారా..” కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒకలాంటి ప్రిపరేషన్ లాంటిది. ఈ సంవత్సరం నన్ను కదిలించే కథల కోసం నేను ఎదురుచూస్తూ గడిపాను. అయితే నేను ఎంతో ఆరాధించే దర్శకులతో విభిన్నమైన నాలుగు చిత్రాలతో రాబోతున్నాను” అంటూ విక్రమ్ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రయాణాలను అభిమానులతో పంచుకోవడానికి తన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పడం విశేషం.. అయితే ప్రస్తుతానికి ఆ నాలుగు సినిమాల కథలు ఏంటి ? ఆ చిత్రాలను ఎవరు నిర్మించబోతున్నారు? దర్శకులు ఎవరు? అనే విషయాలపై విక్రమ్ స్పందించలేదు. మొత్తానికైతే ఏకంగా నాలుగు చిత్రాలతో ఈ ఏడాది అలరించబోతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరచడంతో ఈ స్పీడ్ ఏంటి బాసు అంటూ నెటిజన్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

విక్రమ్ సినీ ప్రయాణం

ఇకపోతే విక్రమ్ నటుడి గానే కాకుండా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు దక్కించుకున్నారు. కరాటే, ఈత పోటీల్లో చదువుకునే సమయంలోనే పాల్గొని ప్రథముడిగా నిలిచేవాడు .గిటార్, పియానో వాయించడం కూడా నేర్చుకున్నాడు. తరచూ నాటకాలలో నటించిన ఈయన ఎక్కువగా ఆంగ్ల నాటకాలలోనే పనిచేశారు. ఇకపోతే విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ ఆయన చివరికి ఇంజనీర్గా స్థిరపడ్డారు ..కానీ విక్రమ్ మాత్రం ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి పేరు సొంతం చేసుకుంటున్నారు.

మొత్తానికి విక్రమ్ నాలుగు సినిమాలతో ఒకేసారి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అభిమానులకు ఇది నిజంగా ఒక పండుగలాంటి వార్త అనే చెప్పాలి. ఈ సినిమాల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.