|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రుక్మిణి వసంత్ ఒక్కో సినిమాకు 5 కోట్లు! రెమ్యూనరేషన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 02-03-2026, 2:35 AM
షాకింగ్: రుక్మిణి వసంత్ ఒక్కో సినిమాకు 5 కోట్లు! రెమ్యూనరేషన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
  • ప్రస్తుతం ఒక్కో సినిమాకు రుక్మిణి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.
  • రుక్మిణి వసంత్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ లో యష్ సరసన నటిస్తోంది.
  • ఈమె నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

కన్నడ నటి రుక్మిణి వసంత్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసుకుందాం.

సప్త సాగరాలు దాటితో రుక్మిణికి గుర్తింపు

Rukmini Vasanth : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో రుక్మిణి వసంత్ ఒకరు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె వరస హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినిమాలు మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం కన్నడ నుంచి వచ్చి విజయం సాధించిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఈ బ్యూటీ అందరిని తన పై తిప్పుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే కాంతారా సినిమా తర్వాత ఆమె రెమ్యూనరేషన్ పెంచింది అంటూ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వినిపించడంతో ఇందులో నిజం ఉందని నమ్ముతున్నారు. మరి ఈమె ఒక సినిమాకి ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుంటుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కన్నడలో మాత్రమే కాదు తెలుగులో కూడా అడుగుపెట్టేసి వరుస సినిమాలని లైన్లో పెట్టుకుంటూ వస్తుంది.. సప్త సాగరాలు దాటి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఏస్ మూవీలో నటించింది.. నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్న ఈ ముద్దుగుమ్మ గత సంవత్సరం శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మదరాసి’ మూవీలో నటించింది.. రీసెంట్ గా రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ మూవీలో నటించి మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది..

సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్న రుక్మిణి?

పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ లో రుక్మిణి

ఒక సినిమా హిట్ అయితే హీరోయిన్ లేదా హీరోలు రెమ్యూనరేషన్ ని పెంచేస్తుంటారు.. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ కూడా తన రెమ్యూనిరేషన్ ని పెంచింది అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాకి ఒక్కో సినిమాకి ఐదు కోట్లకు పైగా తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈమె ఒక హీరో తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఈమె భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ లో నటిస్తుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన జోడిగా నటిస్తుంది. దీంతోపాటుగా తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీలో కూడా నటిస్తుంది. ఇందులో టాక్సిక్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.. ఇప్పుడు డ్రాగన్ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటుగా మరో నాలుగు భారీ ప్రాజెక్టుల కు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మొత్తానికి రుక్మిణి వసంత్ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె రాబోయే చిత్రాల్లో ఎలాంటి నటన కనబరుస్తుందో చూడాలి. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.