
📌 Key Points
- రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఎంజీఆర్‌ను కించపరిచేలా మాట్లాడటంపై విశాల్ అభ్యంతరం తెలిపారు.
- క్షమాపణ చెప్పాలని రాజేంద్రప్రసాద్‌ను విశాల్ డిమాండ్ చేశారు.
- విశాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఎంజీఆర్‌ను కించపరిచేలా మాట్లాడటంపై కోలీవుడ్ నటుడు విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hero Vishal:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కామెడీ హీరోగా పలు చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ప్రస్తుత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమధ్య ఈయన సినిమాల కంటే కూడా సినిమా ఈవెంట్లలో చేసే వ్యాఖ్యలతో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మరొకసారి చేసిన కామెంట్లు పలువురు సినీ నటులకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న హీరో విశాల్ (Vishal) రాజేంద్రప్రసాద్ పై మండిపడ్డారు . అంతేకాదు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ.. తమిళ ప్రజల ఆరాధ్య దైవం , దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ను కించపరిచేలా మాట్లాడడంపై కోలీవుడ్ నటులు కూడా మండిపడుతున్నారు.. ఈ మేరకు విశాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..” తెలుగు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ఇటీవల ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు చూసి నేను చాలా బాధపడ్డాను. మీకు ఒక విషయం చెప్పాలి. తమిళనాడులో ఎంజీఆర్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఆయన మా అందరికీ ఒక గొప్ప దైవం లాంటి నాయకుడు. ఆయన గురించి మీరు తక్కువ చేసి మాట్లాడడం మాకు నచ్చలేదు. మీరు మరో గొప్ప నటుడు కాంతారావు గురించి గొప్పగా చెప్పడం మంచి విషయమే.. కానీ ఒకరిని పొగడడానికి మరొకరిని కించపరచడం కరెక్ట్ కాదు. ఇది తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.
మీలాంటి ఒక గొప్ప నటుడికి ఈ విషయం చెప్పడం నాకు బాధగా ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో చెబుతున్నాను. మీరు పెద్ద మనసుతో మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణలు చెప్పి, ఈ నివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీ స్థాయి ఉన్న నటులను ఎవరైనా ఇలాగే తప్పు చేసి మాట్లాడితే.. నేను మీ కోసమైనా సరే ఇలాగే స్పందిస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు తప్పకుండా క్షమాపణ చెప్పండి” అంటూ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం విశాల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాల్ ఆగ్రహం, క్షమాపణ డిమాండ్
ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే .. రాజేంద్రప్రసాద్ ఇటీవల హైదరాబాదులో జరిగిన “కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025″ మాట్లాడుతూ ..” అసలు కాంతారావు జానపద చిత్రాలను ఆ కాలంలో చాలామంది పడి పడి చూసేవారు. కాంతారావుని చూస్తే ఎంజీఆర్ వణికిపోయేవాడు. ఎవరు ఈయన అని అడిగేవాడు . కాంతారావును చూస్తే ఎంజీఆర్ కి ఉచ్చ” అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఒక స్టార్ నటుడు అన్న కనీస జ్ఞానం లేకుండా నీచమైన భాషను రాజేంద్రప్రసాద్ ఉపయోగించడంతో అటు తమిళ తంబీలు రాజేంద్రప్రసాద్ పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాల్ స్పందిస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
Shocking and repelling to see and hear the recent comments of senior actor Shri Rajendra Prasad, senior actor of our Telugu film industry at a recent function.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Dear Sir, with utmost regards and at the same time with a heavy heart, I pen down this tweet condemning your speech…
— Vishal (@VishalKOfficial) March 12, 2026
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై విశాల్ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


