
📌 Key Points
- సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల టికెట్ల బుకింగ్స్‌లో చిరంజీవి సినిమా హవా కొనసాగుతోంది.
- ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఒక్కరోజులోనే 4,88,000 టికెట్లు బుక్ చేసుకుంది.
- ‘ది రాజా సాబ్’ సినిమాకి నాల్గవ రోజు 82,200 టికెట్లు బుక్ అయ్యాయి.
- ‘ధురంధర్’ సినిమా 38 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా మంచి బుకింగ్స్ రాబడుతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల సందడి మొదలైంది. ఈసారి టికెట్ బుకింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా హవా కొనసాగుతోంది. పలు సినిమాలు విడుదలైనప్పటికీ, చిరంజీవి సినిమా రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి.
సంక్రాంతి బరిలో సినిమాలు
Sankranti Movie 2026 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఈ సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవాలని అటు దర్శక నిర్మాతలతో పాటు క్రేజ్ పెంపొందించుకోవడానికి హీరోలు కూడా తెగ తాపత్రయపడతారు. అందులో భాగంగానే ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సందడి మొదలైంది. అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరొకవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా తాజాగా బుక్ మై షోలో మెగాస్టార్ చిరంజీవిదే హవా కనిపిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా 24 గంటలలో బుక్ మై షో ద్వారా సోల్డ్ అయిన టికెట్ల విషయానికి వస్తే..
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఒక్కరోజులోనే 4,88,000 టికెట్స్ బుక్ అయ్యాయి.
నాలుగవ రోజు ది రాజాసాబ్ సినిమాకి 82,200 టికెట్స్ బుక్ అయ్యాయి.
శివ కార్తికేయన్ పరాశక్తి సినిమా 3వ రోజు 38,400 టికెట్స్ బుక్ అయ్యాయి
టికెట్ బుకింగ్స్‌లో చిరంజీవి హవా
సర్వంమాయ సినిమా 18వ రోజు 28,200 టికెట్లు బుక్ కాగా.. సినిమా వచ్చి 38 రోజులవుతున్నా ధురంధర్ సినిమాకి మంచి బుకింగ్స్ వస్తూ ఉండడం గమనార్హం. 38వ రోజు కూడా ఈ చిత్రానికి 43,500 టికెట్స్ బుక్ అయ్యాయి. బుక్ మై షో లో ఈ టికెట్స్ బుకింగ్ చూస్తుంటే కంప్లీట్ డామినేషన్ చిరంజీవిదే అని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి వార్ టైంలో కూడా ధురంధర్ మూవీకి మంచి బుకింగ్స్ లభిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే గడిచిన ఒక గంటలో సంక్రాంతి సినిమాల టికెట్ బుకింగ్స్ విషయానికి వస్తే..
మన శంకర వరప్రసాద్ గారు – 22.32 K (22,320)
భర్త మహాశయులకు విజ్ఞప్తి – 2.82K (2,820)
ది రాజా సాబ్ – 4.25K (4,250)
ఇతర సినిమాల పరిస్థితి
అవతార్ – 3 : 13.13K (24 గంటల్లో 1,31,300)
ఇక ఈ టికెట్ బుకింగ్స్ జోరు చూస్తుంటే కంప్లీట్ గా ఇప్పటివరకూ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా డామినేషన్ కనిపిస్తోంది.
ఇక చివరిగా.. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఇంకా ఆడియన్స్ వరకు ఈ సినిమా టాక్ చేరలేదు. దీనికి తోడు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు విడుదల కాలేదు. ఈ మూడు సినిమాల ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి అప్పటివరకు మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం డామినేషన్ కొనసాగుతుంది. ఒకవేళ ఈ సినిమా ఫలితాలు వచ్చిన తర్వాత సంక్రాంతి విన్నర్ ఎవరు ? వార్ ఎవరి సైడ్ ఉంది? అనేది తెలుస్తుంది.
మొత్తానికి సంక్రాంతి సినిమాల సందడిలో చిరంజీవి సినిమా టికెట్ బుకింగ్స్‌లో దూసుకుపోతుంది. మిగతా సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.


