|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోలు వీరే.. చిరు, అల్లు అర్జున్‌, మహేష్‌.. ఇంకా ఎవరంటే?

Published: 03-12-2025, 9:10 AM
ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోలు వీరే.. చిరు, అల్లు అర్జున్‌, మహేష్‌.. ఇంకా ఎవరంటే?
  • చిరంజీవి సినిమా ఈ ఏడాది రిలీజ్ కాలేదు; `విశ్వంభర` ఆలస్యం, వచ్చే సంక్రాంతికి `మన శంకరవరప్రసాద్ గారు`.
  • మహేష్ బాబు 2023లో `గుంటూరు కారం` తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ; 2027 వరకు విడుదల లేదు.
  • అల్లు అర్జున్ ఈ ఏడాది కొత్త సినిమా చేయలేదు; అట్లీ దర్శకత్వంలో సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌గా సినిమా.
  • ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ చరణ్, నాగార్జున, ప్రభాస్, నాని వంటి పలువురు హీరోలు ఈ ఏడాది సందడి చేశారు.

ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద అనేక మంది స్టార్ హీరోలు సందడి చేశారు. అయితే, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి కొందరు అగ్ర తారలు మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేకపోయారు. ఈ ఏడాది వారి సినిమాలు ఎందుకు విడుదల కాలేదు, వారి తదుపరి ప్రాజెక్ట్‌లు ఏమిటో తెలుసుకుందాం.

చిరంజీవి: ఈ ఏడాది ఎందుకు మిస్సయ్యారు?

ఈ ఏడాది చాలా మంది స్టార్‌ హీరోలు వచ్చి బాక్సాఫీసు వద్ద తమ సత్తాని చాటారు. ఎన్టీఆర్‌ `వార్‌ 2`తో, వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం`తో, రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`తో, నాగార్జున `కూలీ`, `కుబేర` చిత్రాలతో, ప్రభాస్‌ `కన్నప్ప`, నాని `హిట్‌ 3`లో, రవితేజ `మాస్‌ జాతర`, `మిస్టర్‌ బచ్చన్‌`, విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌`తో చిత్రాల్లో కనిపించారు. యంగ్‌ హీరోలు కూడా చాలా వరకు తమ సినిమాలతో అలరించారు. బాలకృష్ణ ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. మరి ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా అలరించని హీరోలు ఎవరో తెలుసుకుందాం.

ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా కనిపించని హీరోలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్‌ కాక రెండేళ్లు అవుతుంది. 2023లో `భోళా శంకర్‌`తో వచ్చారు. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత `విశ్వంభర` చిత్రంలో నటించారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. ఈ ఏడాది సమ్మర్‌ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. వచ్చే సమ్మర్‌లో రాబోతుంది. అంతకంటే ముందే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీతో రాబోతున్నారు. ఇది ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించడం విశేషమైతే, వెంకటేష్‌ గెస్ట్ గా మెరవబోతుండటం విశేషం. ఇలా ఈ ఏడాది చిరు తన అభిమానులను నిరాశ పరిచారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.

మహేష్ బాబు: రాజమౌళి ప్రాజెక్ట్‌తో బిజీ

ఇదే దారిలో మహేష్‌ బాబు ఉన్నారు. ఆయన చివరగా గతేడాది `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్‌. ప్రస్తుతం ఆయన `వారణాసి`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే టైటిల్‌ గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ 2027లో విడుదల కాబోతుంది. అంటే ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా మహేష్‌ అభిమానులను నిరాశ పర్చబోతున్నారని చెప్పొచ్చు.

అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ ఏడాది ఒక్క మూవీలో కూడి నటించలేదు. ఆయన చివరగా `పుష్ప 2`తో అలరించారు. ఇది వచ్చే ఏడాది డిసెంబర్‌లోనే విడుదలైంది. దీంతో ఈ ఏడాది ఆయన రాలేదనే ఫీలింగ్‌ లేకుండా నడిచిపోయింది. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బన్నీ. సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది రిలీజ్‌ కావడానికి కూడా మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అంటే బన్నీ ఏ ఏడాదిలోనే కాదు, వచ్చే ఏడాది కూడా కనిపించడం కష్టమనే టాక్‌ వినిపిస్తోంది.

అల్లు అర్జున్: అట్లీ సినిమాతో రాబోతున్న బన్నీ

అలాగే మరో స్టార్‌ హీరో గోపీచంద్‌ కూడా ఈ ఏడాది ఆడియెన్స్ ని అలరించలేకపోయారు. ఆయన గతేడాది `భీమ`, `విశ్వం` చిత్రాల్లో నటించాడు. కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. త్వరలో ఆయన ఓ హిస్టారికల్‌ కథతో రాబోతున్నారు. ఇందులో వారియర్‌గా గోపీచంద్‌ కనిపించబోతున్నారు. దీనికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. వీరితోపాటు శర్వానంద్, అఖిల్‌  కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరంతా వచ్చే ఏడాది సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.

నిజానికి డార్లింగ్‌ ప్రభాస్‌ ఈ ఏడాది `కన్నప్ప`లో కాసేపు మెరిశారు. `బాహుబలి ది ఎపిక్‌ రీ రిలీజ్‌తో మెప్పించారు. కానీ తాను సోలో హీరోగా నటించిన ఒక్కమూవీ కూడా విడుదల కాలేదు. ఇప్పుడు `ది రాజాసాబ్‌`లో నటిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది.

ఈ ఏడాది కొందరు స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే, వచ్చే ఏడాది వీరందరూ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వారి రాక కోసం ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.