|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అట్లేట్ల మారుస్తరు.. రొమాంటిక్ సీన్స్ తొలగించిన సెన్సార్ బోర్డ్‌పై హీరోయిన్ ఫుల్ ఫైర్

Published: 11-07-2025, 8:25 AM
అట్లేట్ల మారుస్తరు.. రొమాంటిక్ సీన్స్ తొలగించిన సెన్సార్ బోర్డ్‌పై హీరోయిన్ ఫుల్ ఫైర్

సెన్సార్ బోర్డు తాజాగా సూపర్‌మ్యాన్ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలను తొలగించింది. ఈ నిర్ణయంపై హీరోయిన్ శ్రేయా ధన్వంతరి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇటీవల సెన్సార్ బోర్డు నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్నాయి.

Key Points

1

సెన్సార్ బోర్డ్ సూపర్‌మ్యాన్ సినిమాలోని రొమాంటిక్ సీన్ తొలగించింది.

2

హీరోయిన్ శ్రేయా ధన్వంతరి ఈ నిర్ణయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

4

సెన్సార్ బోర్డు నిర్ణయాలపై సినీ ప్రముఖుల ఆగ్రహం పెరుగుతోంది.

సూపర్‌మ్యాన్ సినిమాపై సెన్సార్ బోర్డు కోతలు

గత కొద్ది కాలంగా సెన్సార్ బోర్డు అన్ని భాషల సినిమాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల వచ్చిన చిత్రాలు L-2 ఎంపురాన్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(Janaki vs. State of Kerala) వంటి సినిమాలకు సెన్సార్ పలు కోతలు సూచించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBSC) హాలీవుడ్ సినిమా ‘సూపర్‌మ్యాన్’(Superman)లో 33 సెకన్ల రొమాంటిక్ సీన్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూవీ టీమ్ తొలగించింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు.

ఇక ఈ విషయం తెలుసుకున్న యంగ్ హీరోయిన్ శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwantari) ట్విట్టర్ ద్వారా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సూపర్‌మ్యాన్ సినిమాలో సెన్సార్ కట్ చేసింది నిజమైతే.. ఈ ఘటన నాకు నవ్వు తెప్పిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక అనవసరమైన విషయం మన దృష్టికి వస్తుంది. ఇది మనకున్న సమస్యల్లో చిన్నదే కావచ్చు కానీ మిగతా పెద్ద సమస్యల గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా అంటే అది లేదు. ఇలానే ప్రతి రోజు ఏదో ఒక చెత్త విషయం జరుగుతూనే ఉంది’’అని రాసుకొచ్చింది. కాగా, ఈ అమ్మడు తెలుగులో నాగచైతన్య ‘జోష్’ మూవీలో నటించింది. అలాగే స్నేహగీతంలోనూ కనిపించింది. అలాగే తమిళ చిత్రాల్లోనూ నటించింది కానీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

శ్రేయా ధన్వంతరి ఆగ్రహం

సెన్సార్ బోర్డు నిర్ణయాలపై విమర్శలు

సెన్సార్ బోర్డు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. శ్రేయా ధన్వంతరి వంటి ప్రముఖుల స్పందనలు ఈ విషయాన్ని మరింత ప్రజాస్వామ్య చర్చకు తెచ్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.