|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్ స్టార్‌పై మనసుపడ్డ హీరోయిన్.. గది నిండా ఫొటోలే..

Published: 31-10-2025, 4:04 PM
సూపర్ స్టార్‌పై మనసుపడ్డ హీరోయిన్.. గది నిండా ఫొటోలే..

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తన చిన్ననాటి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. పదేళ్ల వయసులో తనకు అక్షయ్ కుమార్‌పై క్రష్ ఉందని, అతని ఫొటోలతో తన గది నిండిపోయిందని చెప్పింది. ఆపై షారుఖ్ ఖాన్‌పై ఇష్టం పెరిగిందని వివరించింది.

Key Points

1

స్వరా భాస్కర్ తన చిన్ననాటి క్రష్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది.

2

పదేళ్ల వయసులో అక్షయ్ కుమార్‌పై మనసుపడి, అతనే తన భర్త కావాలని కోరుకుంది.

4

తర్వాత షారుఖ్ ఖాన్‌పై ఇష్టం పెరిగిందని స్వరా భాస్కర్ చెప్పింది.

చిన్ననాటి క్రష్‌ను బయటపెట్టిన స్వరా భాస్కర్

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి చెప్పింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు ‘చురా హై దిల్ మేరా’ సాంగ్ చూస్తున్నప్పుడు.. తనకు కాబోయే హజ్బెండ్ అతనే కావాలని అనుకున్నా. చాలా అడ్మైర్ చేశా. ఆ టైంలో రాహుల్ ద్రావిడ్‌ను కూడా ఆరాధించా. నా గది నిండా వీరిద్దరి ఫొటోలు మాత్రేమే ఉండేవి. కానీ పొలిటికల్ డిఫరెన్సెస్ కారణంగా అక్షయ్‌కు తనకు మధ్యన ఊహించుకున్నఫెయిరీ టేల్ ఫెయిల్ అయిపోయిందని చెప్పింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం పెరిగిందని తెలిపింది స్వరా భాస్కర్. కాగా ఈ మధ్య స్వరా.. అఖిలేష్ యాదవ్ భార్యపై తనకు క్రష్ ఉందని చెప్పి ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత తన స్టేట్మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది.

అక్షయ్ కుమార్ ఫొటోలతో నిండిన గది

షారుఖ్ ఖాన్‌పై ఇష్టం పెరిగింది

మొత్తం మీద, స్వరా భాస్కర్ తన వ్యక్తిగత జీవితం నుండి కొన్ని సరదా, ఆశ్చర్యకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.