|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మ‌హేష్ బాబు పెద్ద‌ స్టార్ హీరో అని నాకు తెలీదు..హీరోయిన్ సంచ‌ల‌నం!

Published: 09-12-2025, 7:08 AM
మ‌హేష్ బాబు పెద్ద‌ స్టార్ హీరో అని నాకు తెలీదు..హీరోయిన్ సంచ‌ల‌నం!
  • నటి కృతి సనన్ ‘1-నేనొక్కడినే’ సమయంలో మహేష్ బాబు క్రేజ్ తనకు తెలియదని వెల్లడించింది.
  • సినిమా సెట్‌లో ఇతర నటీనటుల ద్వారా మహేష్ బాబు స్టార్‌డమ్ తెలుసుకున్నానని వివరించింది.
  • దర్శకుడు సుకుమార్‌తో మళ్లీ పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు కృతి సనన్ పేర్కొంది.
  • కృతి సనన్ వ్యాఖ్యలపై మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబుపై బాలీవుడ్ నటి కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘1-నేనొక్కడినే’ సినిమా చేసే సమయంలో మహేష్ పెద్ద స్టార్ హీరో అని తనకు తెలియదని ఆమె సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మహేష్ బాబుపై కృతి సనన్ షాకింగ్ వ్యాఖ్యలు

ప్రిన్స్ మహేష్ బాబు.. అగ్ర హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఇలా అన్ని కథలు చేసి, తెలుగుపేక్షకులకు బాగా దగ్గరయ్యారు మహేష్ బాబు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఇప్పటికీ అతని హవా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పుడు వార‌ణాసితో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌బోతున్నాడు మ‌మేష్‌. అయితే అలాంటి అగ్ర హీరో ప్రిన్స్ మహేష్ బాబు పై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘1-నేనొక్కడినే’ సినిమా అనుభవాలు

ఎన్నో బాలీవుడ్ సినిమాలు నేను చూశాను..కానీ మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ హీరో అని తనకు తెలియదంటూ బాంబు పేల్చారు. మహేష్ బాబు, కృతి సనన్ కాంబినేషన్ లో 1 – నేనొక్కడినే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయగా కృతి సనన్ ( Kriti Sanon) హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. 2014 సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో అని తనకు తెలియదంటూ తాజాగా కృతి సనన్ వెల్లడించారు.

అభిమానుల ఆగ్రహం, వైరల్ కామెంట్స్

కానీ ఆ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇతర నటీ నటుల‌ ద్వారా అతని క్రేజ్ తెలుసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత మహేష్ బాబు క్రేజ్ ఏంటో తనకు పూర్తిగా అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు దర్శకుడు సుకుమార్ కూడా చాలా మంచి వాళ్ళని, అతని సినిమాలో అవకాశం వస్తే మళ్లీ చేస్తానన్నారు. దీంతో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ హీరోని పట్టుకొని, తెలియదు అంటావా ? అని మండిపడుతున్నారు. హిందీ సినిమాలు చూస్తే, మ‌హేష్ గురించి తెలుస్తుందా? అని నిల‌దీస్తున్నారు. క్లిక్

మొత్తానికి కృతి సనన్ వ్యాఖ్యలు మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి, సినిమా వర్గాల్లోనూ ఆసక్తిని రేపాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.