|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డాక్టర్లే హీరోయిన్లు.. టాలీవుడ్‌లో సంచలనం! సాయిపల్లవి, శ్రీలీల ఫుల్ ఫామ్!!

Published: 15-02-2026, 8:05 AM
డాక్టర్లే హీరోయిన్లు.. టాలీవుడ్‌లో సంచలనం! సాయిపల్లవి, శ్రీలీల ఫుల్ ఫామ్!!
  • సాయిపల్లవి: డాక్టర్‌గా చేస్తూనే హీరోయిన్‌గా క్రేజ్, సెలెక్టివ్‌గా సినిమాలు!
  • శ్రీలీల: స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే డాక్టర్‌ కోర్సు పూర్తి, పట్టా పొందిన ఘనత!
  • మీనాక్షి చౌదరి: డెంటల్ సర్జన్‌, స్టేట్ లెవెల్ స్విమ్మర్, ఫెమినా మిస్ ఇండియా రన్నరప్!
  • కోమలీ ప్రసాద్, ఐశ్వర్యా లక్ష్మి: సినిమాలు చేస్తూనే డాక్టర్ వృత్తిని పూర్తి చేసిన టాలెంటెడ్ హీరోయిన్స్!

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ మొదలైంది! హీరోయిన్లు కేవలం నటిస్తే సరిపోదు, డాక్టర్లు కూడా అవుతున్నారు. సాయిపల్లవి, శ్రీలీల లాంటి డాక్టర్ కమ్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

సాయిపల్లవి: డాక్టర్ టు హీరోయిన్ జర్నీ!

ఒకప్పుడు జనరల్‌గా ఒక డైలాగ్‌ ఉండేది, డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యారని, చాలా వరకు ఈ డైలాగ్‌ వినిపించింది. అదొక కొటేషన్‌లా ఉండిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమాని ఊపేసిన సౌందర్య కూడా డాక్టర్‌ కావాలనుకుంది. కానీ సినిమా ఆఫర్లు రావడంతో బలవంతంగా సినిమాల్లోకి వెళ్లింది. డాక్టర్‌ కాలేకపోయింది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సౌందర్యలా అలా ఉండిపోవడం లేదు. యాక్టర్లు డాక్టర్లు అవుతున్నారు. డాక్టర్లు యాక్టర్లు అవుతున్నారు. కాలానికి తగ్గట్టుగా మారిపోతున్నారు. ఒకే వృత్తిలో కొనసాగడం లేదు. రెండు మూడు రంగాల్లో ఉంటున్నారు. మరి డాక్టర్లు అయిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

డాక్టర్‌ అయి యాక్టర్‌ అయిన హీరోయిన్లలో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు. ఆమె డాక్టర్‌గా చేస్తూనే హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా సాయిపల్లవి రాణిస్తుంది. సినిమాలు కూడా సెలక్టీవ్‌గా చేస్తుంది. ప్రస్తుతం `రామాయణం` చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో ఓ మూవీ, హిందీలో మరో సినిమా చేస్తుంది సాయిపల్లవి. అయితే సాయిపల్లవి డాక్టర్‌ వృత్తి చేయడం లేదని టాక్‌.

శ్రీలీలా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే డాక్టర్‌ కోర్స్ పూర్తి చేసింది. పట్టా పొందింది. సినిమాలు చేస్తూనే డాక్టర్‌గా కొనసాగబోతుంది శ్రీలీలా. ప్రస్తుతం శ్రీలీలా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తోపాటు హిందీలో ఓమూవీ చేస్తోంది.

శ్రీలీల: డాక్టర్ పట్టా పుచ్చుకున్న స్టార్ హీరోయిన్!

మరో స్టార్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరీ కూడా డాక్టర్‌. ఆమె హీరోయిన్‌గా చేస్తూనే డాక్టర్‌ని పూర్తి చేసింది. డెంటల్‌ సర్జన్‌ కోర్స్ చేసింది. ఆమె డాక్టర్‌ గానే కాదు స్టేట్‌ లెవల్‌ స్విమ్మర్‌, బ్యాట్మింటన్‌ ప్లేయర్‌, అంతేకాదు ఫెమినా మిస్‌ ఇండియా కాంపిటీషన్‌లోనూ పాల్గొంది. ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

`శశివదనే`, `నెపోలియన్‌`, `హిట్‌` చిత్రాల్లో నటించిన కోమలీ ప్రసాద్‌ కూడా డాక్టరే. ఆమె ప్రవర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మెడిసిన్‌ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే డాక్టర్‌ కోర్స్ కంప్లీట్‌ చేసింది.

`గాడ్సే` చిత్రంలో నటించిన ఐశ్వర్యా లక్ష్మి సైతం డాక్టరే. ఆమె హీరోయిన్‌గా చేస్తూనే డాక్టర్‌ వృత్తిని కంప్లీట్‌ చేసింది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని సినిమాల్లోకి వచ్చింది. సినిమాలు చేస్తూనే ఇంటర్న్ షిప్‌ కూడా పూర్తి చేసింది.

టాలీవుడ్‌లో డాక్టర్ హీరోయిన్ల హవా!

`గాడ్సే` చిత్రంలో నటించిన ఐశ్వర్యా లక్ష్మి సైతం డాక్టరే. ఆమె హీరోయిన్‌గా చేస్తూనే డాక్టర్‌ వృత్తిని కంప్లీట్‌ చేసింది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని సినిమాల్లోకి వచ్చింది. సినిమాలు చేస్తూనే ఇంటర్న్ షిప్‌ కూడా పూర్తి చేసింది.

ఫెమినా మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్ 2017లో పాల్గొని విన్నర్‌గా నిలిచిన మనుషీ చిల్లర్‌ కూడా డాక్టరే. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చేస్తోంది. రెండేళ్ల క్రితం వరుణ్‌ తేజ్‌తో `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటించింది మనుషీ చిల్లర్‌.

`ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య`, `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన రూప కొడవయూర్‌ కూడా డాక్టర్‌. ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్నాకే సినిమాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఆఫర్లు లేవు. డాక్టర్‌గానే రాణిస్తోంది.

ఇలాంటి టాలెంటెడ్ హీరోయిన్లు మన టాలీవుడ్‌లో ఉండటం నిజంగా గర్వకారణం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ డాక్టర్ హీరోయిన్ల గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.