|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫ్రాంఛైజీ హీరో లీడ్ రోల్లో తమిళ స్పోర్ట్స్ డ్రామా.. నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Published: 03-10-2025, 10:15 AM
ఆ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫ్రాంఛైజీ హీరో లీడ్ రోల్లో తమిళ స్పోర్ట్స్ డ్రామా.. నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

డీమాంటే కాలనీ ఫేమ్ అరుళ్‌నిధి లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘రాంబో’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేటర్లను దాటుకుని నేరుగా సన్ నెక్ట్స్ లోకి వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. దీని ట్రైలర్ అక్టోబర్ 4న విడుదల కానుంది.

Key Points

1

అరుళ్‌నిధి హీరోగా తమిళ స్పోర్ట్స్ డ్రామా 'రాంబో' నేరుగా ఓటీటీలోకి వస్తోంది.

2

ఈ సినిమా అక్టోబర్ 10న సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4

ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది.

రాంబో మూవీ ఓటీటీ రిలీజ్ వివరాలు

తమిళ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. హారర్ మూవీ ఫ్రాంఛైజీ అయిన డీమాంటే కాలనీ ఫేమ్ అరుళ్‌నిధి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పేరు రాంబో (Rambo). ఈ సినిమా ట్రైలర్ శనివారం (అక్టోబర్ 4) రిలీజ్ కానుండగా.. వచ్చే వారం స్ట్రీమింగ్ కానుంది.

అరుళ్‌నిధి లీడ్ రోల్లో నటిస్తున్న రాంబో మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాను అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఇక శనివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు కూడా శుక్రవారం (అక్టోబర్ 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది.

అరుళ్‌నిధి బాక్సర్ గా రాంబో కథా నేపథ్యం

“గ్లోవ్స్ వేసేసుకున్నాడు.. ఫైట్ జరగబోతోంది. అరుళ్‌నిధి రాంబో మూవీతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపించబోతున్నాడు. అక్టోబర్ 10న కేవలం సన్ నెక్ట్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నాకౌట్ మిస్ కావద్దు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

2015లో వచ్చిన డీమాంటే కాలనీ తో పాపులర్ అయిన నటుడు అరుళ్‌నిధి. గతేడాది ఈ సినిమా సీక్వెల్ తో వచ్చాడు. డీమాంటే కాలనీ 3లోనూ నటిస్తున్నాడు. ఈ హీరో లీడ్ రోల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా రాంబో. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. దీనిని ముత్తయ్య డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది మొదట్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. తాన్యా రవిచంద్రన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

డీమాంటే కాలనీ ఫేమ్ అరుళ్‌నిధి కెరీర్

సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే మూవీగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో అరుళ్‌నిధి ఓ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ సన్ నెక్ట్స్ పోస్ట్ చేసిన పోస్టర్ లో అతడు నాకౌట్ పంచ్ కు రెడీ అవుతున్నట్లుగా కనిపించాడు. రాంబో మూవీకి ది అన్‌డిఫీటబుల్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు.

అరుళ్‌నిధి బాక్సర్ గా కనిపించనున్న ‘రాంబో’ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదం అందించనుంది. డీమాంటే కాలనీ హీరో కొత్త అవతార్ లో ఎలాంటి ప్రభావం చూపుతాడో చూడాలి. సన్ నెక్ట్స్ లో అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.