|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హోలీ గందరగోళం: పండుగ ఎప్పుడు? సెలవు ఎప్పుడు? పండితుల విశ్లేషణ!

Published: 02-03-2026, 6:05 AM
హోలీ గందరగోళం: పండుగ ఎప్పుడు? సెలవు ఎప్పుడు? పండితుల విశ్లేషణ!
  • హోలీ పండుగ జరుపుకోవడంపై ప్రజల్లో నెలకొన్న అయోమయం.
  • చంద్రగ్రహణం కారణంగా హోలీ వేడుకలపై పండితుల సూచనలు.
  • ప్రభుత్వం సెలవు ప్రకటించిన తేదీపై కొనసాగుతున్న సందిగ్ధత.
  • మార్చి 4న హోలీ జరుపుకోవాలని సూచిస్తున్న పండితులు.

ఈ సంవత్సరం హోలీ పండుగ తేదీపై ప్రజల్లో అయోమయం నెలకొంది. చంద్రగ్రహణం కారణంగా పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించిన తేదీ కూడా గందరగోళానికి దారితీస్తోంది.

హోలీ పండుగపై ప్రజల్లో అయోమయం ఎందుకు?

ప్రతీ ఏడాది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ పూర్ణిమరోజున హోలీ పండుగ జరుపుకుంటాం. కానీ.. ఈసారి హోలీ పండుగ జరుపుకోవడంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇందుకు కారణం చంద్రగ్రహణం, ప్రభుత్వం ప్రకటించిన సెలవు. చంద్రగ్రహణం రోజున సూతకం ఉంటుంది కాబట్టి హోలీ పండుగను జరుపుకోకూడదని పండితులు చెప్తున్నారు. ద్రిక్ పంచాంగం ప్రకారం హోలికా దహన్ కు మార్చి 2వ తేదీ సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 8.50 వరకూ ముహూర్తం ఉందని చెప్తున్నారు.చంద్రగ్రహణ ప్రభావం ఉండటం వల్ల హోలికా దహన్ వేడుకను మార్చి 2వ తేదీనే నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5.55 గంటల నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమై 3వ తేదీ సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుంది. కాబట్టి 2వ తేదీనే హోలికా దహన్ వేడుకను జరుపుకోవచ్చునని స్పష్టం చేశారు. ఇక 3వ తేదీన గ్రహణ దోషం కారణంగా రంగులు చల్లుకోవడం వంటి వేడుకలను జరుపుకోకూడదని, హోలీ ఉత్సవాలను మార్చి 4వ తేదీన జరుపుకోవడమే ఉత్తమమని తెలిపారు. గ్రహణ సమయాన్ని కేవలం దైవారాధనకే కేటాయించాలని సూచించారు. చంద్రుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం. గ్రహణం కారణంగా చంద్రుడు వేదనకు గురై ఉంటాడు కాబట్టి ఆ రోజు రంగుల పండుగ చేసుకోవడం శాస్త్ర విరుద్ధమని చెప్తున్నారు.

పండితుల సూచనలు: హోలీ ఎప్పుడు జరుపుకోవాలి?

గ్రహణం ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో మార్చి 4న పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నప్పటికీ.. మార్చి 3నే రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి. హోలీ పండుగ జరుపుకోవడంపై క్లారిటీ వచ్చినా సెలవుపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ప్రకటించిన సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దీంతో కొందరు మాత్రం మార్చి 3నే హోలీ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సెలవుపై సందిగ్ధత: ప్రభుత్వం ఏం చెబుతోంది?

గమనిక : పైన తెలిపిన విషయాలు పండితుల అభిప్రాయాల ప్రకారం ఇచ్చినవి. ఈ విషయాలను కచ్చితంగా నమ్మాలని దిశ ప్రోత్సహించదు.

హోలీ పండుగ జరుపుకునే విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ, సెలవు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.