|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిగ్గజ నటుడు రాబర్ట్ డువాల్ కన్నుమూత! గాడ్ ఫాదర్ నటుడి విషాదకర వీడ్కోలు!

Published: 17-02-2026, 12:35 AM
దిగ్గజ నటుడు రాబర్ట్ డువాల్ కన్నుమూత! గాడ్ ఫాదర్ నటుడి విషాదకర వీడ్కోలు!
  • ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డువాల్ 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
  • గాడ్ ఫాదర్ మూవీలో ఆయన నటనకు ఎంతో పేరు వచ్చింది, ఆస్కార్ కూడా గెలుచుకున్నారు.
  • సుమారు 70 ఏళ్ల కెరీర్‌లో 140కి పైగా చిత్రాల్లో రాబర్ట్ నటించారు.
  • ఆయన మృతికి హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డువాల్ 95 ఏళ్ల వయసులో మరణించారు. గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాబర్ట్ డువాల్ సినీ జీవితం

Film industry:చిత్ర పరిశ్రమలో ఈమధ్య ఒకరి మరణ వార్త మరువకముందే మరొకరు మరణం చెందుతూ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు.. అటు ఇండస్ట్రీలో దిగ్గజాలు ఇలా స్వర్గస్తులవుతుండడంతో ఇండస్ట్రీ కూడా ఒంటరవుతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎంతోమంది వివిధ కారణాల వల్ల పరమపదిస్తూ అభిమానులను దుఃఖంలోకి ముంచేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను అనాధలు చేస్తున్నారనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నిన్న ప్రముఖ సింగర్ గీత పట్నాయక్ 73 సంవత్సరాలు వయసులో అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. నేడు మరో నటుడు తుదిశ్వాస విడవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆయన ఎవరో కాదు హాలీవుడ్ దిగ్గజం రాబర్ట్ డువాల్. 95 సంవత్సరాల వయసులో ఆయన పరమపదించారు. ఆస్కార్ విజేత , గాడ్ ఫాదర్ మూవీ నటుడి మృతితో ఒక సుదీర్ఘ సినీ శకం ముగిసిందని చెప్పవచ్చు.. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన రాబర్ట్ వర్జీనియాలోని తన నివాసంలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య లూసియానా పెడ్రాజా అధికారికంగా ధ్రువీకరించారు. వయసు రీత్యా సహజ కారణాలతోనే ఆయన స్వర్గస్తులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 70 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్లో సుమారుగా 140కి పైగా చిత్రాలలో నటించి ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరిగా నిలిచారు.

గాడ్ ఫాదర్ నటుడి మృతి

రాబర్ట్ మరణ వార్త అటు హాలీవుడ్ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గాడ్ ఫాదర్ , చిత్ర దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, నటులు రాబర్ట్ డి నిరో, అల్ పాచినో, ఆడమ్ తదితరులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తూ ఎమోషనల్ పోస్టులు కూడా పంచుకున్నారు. ఒక అద్భుతమైన నటుడిని ఇప్పుడు సినీ ప్రపంచం కోల్పోయిందని ఆయన భార్య లూసియానా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో హాలీవుడ్లో ఒక శకం ముగిసిపోయిందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

సినీ ప్రముఖుల సంతాపం

రాబర్ట్ నటించిన చిత్రాల విషయానికొస్తే.. 1962లో ‘టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ‘ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నెట్వర్క్, ది గ్రేట్ సాంటినీ వంటి చిత్రాలతో నటన వైవిధ్యాన్ని చాటుకున్న ఈయన 1983లో టెండర్ మెర్సీస్ చిత్రంలో మాజీ కంట్రీ సింగర్ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఏడుసార్లు ఆస్కార్ కి నామినేషన్ పొందిన ఈయన.. నటనతో పాటు దర్శకత్వంలో కూడా తన దైన ముద్ర వేసుకున్నారు. అలాంటి ఒక గొప్ప నటుడు నేడు సినీ లోకాన్నే కాదు.. లోకాన్నే విడిచి వెళ్లడంతో ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

రాబర్ట్ డువాల్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.