|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసి సెట్స్ మీద ‘జై బాబు’ నినాదం! హాలీవుడ్ రిపోర్టర్ క్రౌలీ మామూలోడు కాదుగా!!

Published: 05-02-2026, 2:05 AM
వారణాసి సెట్స్ మీద 'జై బాబు' నినాదం! హాలీవుడ్ రిపోర్టర్ క్రౌలీ మామూలోడు కాదుగా!!
  • హాలీవుడ్ రిపోర్టర్ లియామ్ క్రౌలీ.. వారణాసి టీమ్ ఇంటర్వ్యూలో ‘జై బాబు’ నినాదం!
  • స్క్రీన్ రాంట్ యూట్యూబ్ ఛానెల్ లో మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్ ల ఇంటర్వ్యూ వైరల్
  • లియామ్ క్రౌలీ గతంలో అనేకమంది హాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన అనుభవం
  • వారణాసి ప్రమోషన్స్ తో హాలీవుడ్ రిపోర్టర్స్ కి కూడా మంచి గుర్తింపు!

RRR సినిమాతో రాజమౌళి హాలీవుడ్ లో సత్తా చాటాడు. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి సినిమాను హాలీవుడ్ టార్గెట్ గా విడుదల చేస్తున్నాడు. దీంతో ప్రమోషన్స్ కూడా అక్కడ భారీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ రిపోర్టర్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

లియామ్ క్రౌలీ: జై బాబు నినాదంతో వైరల్

Liam Crowley : RRR సినిమాతో ఆస్కార్ సాధించి హాలీవుడ్ లో ఫేమ్ రావడంతో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా వారణాసిని హాలీవుడ్ టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాడు. దీంతో రాజమౌళి వారణాసి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. హాలీవుడ్ లో వారణాసి మూవీ టీమ్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు నిన్న రిలీజయిన సంగతి తెలిసిందే.(Liam Crowley)

వీటిల్లో స్క్రీన్ రాంట్ యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి హాలీవుడ్ రిపోర్టర్ లియాం క్రౌలికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ లియాం క్రౌలి మహేష్ బాబుని అభిమానులు పిలిచే స్లోగన్ తో జై బాబు అనడం, ఇండియాలో మహేష్ ఫ్యాన్ డమ్ గురించి మాట్లాడటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు.

హాలీవుడ్ లో వారణాసి సందడి

అంతే కాకుండా ముగ్గురితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అక్కడ కూడా జై బాబు అని పోస్ట్ చేసాడు లియాం క్రౌలి. దీంతో లియాం క్రౌలి టాలీవుడ్ లో వైరల్ గా మారాడు.

న్యూయార్క్ కి చెందిన లియాం క్రౌలి జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్ చేసి రిపోర్టర్, హోస్ట్ గా మారాడు. హాలీవుడ్ లో అనేకమంది సెలబ్రిటీలను ఇప్పటికే లియాం క్రౌలి ఇంటర్వ్యూ చేసాడు. స్క్రీన్ రాంట్ అనే పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే కాఫీ చాట్స్ అనే ప్రోగ్రాంతో న్యూయార్క్ లో ఉన్న కేఫ్స్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసాడు.

మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలే!

లియాం క్రౌలి తో పాటు మరో రెండు హాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ కి వారణాసి టీమ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మొత్తానికి మహేష్ హాలీవుడ్ ప్రమోషన్స్ తో అక్కడి రిపోర్టర్స్ కూడా ఇక్కడ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ సమయానికి వారణాసి టీమ్ హాలీవుడ్ లో ఇంకెన్ని ఇంటర్వ్యూలు ఇస్తుందో చూడాలి.

లియాం క్రౌలి వారణాసి టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..

మొత్తానికి మహేష్ బాబు వారణాసి సినిమాతో హాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అక్కడ రిపోర్టర్స్ కూడా ఇక్కడ ఫేమస్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.