|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్‌కు షాక్: హార్ముజ్ జలసంధిపై మిత్రదేశాల తిరుగుబాటు!

Published: 16-03-2026, 10:05 PM
ట్రంప్‌కు షాక్: హార్ముజ్ జలసంధిపై మిత్రదేశాల తిరుగుబాటు!
  • హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం.
  • మిత్ర దేశాలు, చైనా ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించాయి.
  • నాటో దేశాలు యుద్ధ నౌకలను పంపబోమని తేల్చి చెప్పాయి.
  • తమ శత్రువులకు జలసంధి మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను మిత్ర దేశాలు, చైనా తిరస్కరించాయి. నాటో దేశాలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి.

ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించిన మిత్రదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఊహించ‌ని ఎదురు దెబ్బ తగిలింది. హార్ముజ్ జ‌ల‌సంధిని ఓపెన్ చేసేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జల సంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలు, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు నేపథ్యంలో చైనా, మిత్ర దేశాలు ససేమిరా అన్నాయి.

యుద్ధ నౌకలు పంపబోమని నాటో ప్రకటన

ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలు అయిన ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీలతో పాటు జపాన్ కూడా స్పష్టం చేసింది. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని సంచలన ప్రకటన చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచనలు చేసింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండబోదని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నాటో దేశాలు వెనక్కి తగ్గడం లేదు. మరి దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

శత్రువులకు జలసంధి మూసివేత: ఇరాన్ హెచ్చరిక

తమ శత్రువులకు హార్ముజ్ జ‌ల‌సంధి క్లోజ్ గానే ఉంటుందని ఇరాన్ వెల్లడించింది. తమ మిత్ర దేశాలకు ఈ మార్గం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.

హార్ముజ్ జలసంధి వివాదం అమెరికాకు ఒక సవాలుగా మారింది. మిత్ర దేశాల మద్దతు లేకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.