|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎలాంటి రవితేజ ఎలా అయిపోయాడు, ఫ్యాన్స్ ఆవేదన ఇదే.. రాజేంద్ర ప్రసాద్ పై దారుణంగా ట్రోలింగ్

Published: 02-11-2025, 12:04 PM
ఎలాంటి రవితేజ ఎలా అయిపోయాడు, ఫ్యాన్స్ ఆవేదన ఇదే.. రాజేంద్ర ప్రసాద్ పై దారుణంగా ట్రోలింగ్

మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర’ నిరాశపరిచింది. దీంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ఈవెంట్ వ్యాఖ్యలపై దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

Key Points

1

రవితేజకు 'మాస్ జాతర' వరుసగా ఐదవ ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.

2

ఫ్యాన్స్ రవితేజ పాత వైవిధ్యభరిత చిత్రాలను గుర్తుచేస్తూ ఆయన వైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

4

రాజేంద్ర ప్రసాద్ 'మాస్ జాతర' ప్రీ-రిలీజ్ ఈవెంట్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

రవితేజ కెరీర్‌పై ఫ్యాన్స్ ఆవేదన: వరుస ప్లాపులు

మాస్ మహారాజ్ అని ఫ్యాన్స్ రవితేజని ముద్దుగా పిలుస్తుంటారు. తనకి ఉన్న బిరుదుకి తగ్గట్లుగానే రవితేజ ఇటీవల మాస్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ చిత్రాలు అంతగా వర్కౌట్ కావడం లేవు. దారుణమైన ఫ్లాపులుగా మారుతున్నాయి. దీనితో రవితేజ ఒక్కసారి తన సినిమాలని, ఎంచుకుంటున్న కథలని రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా రవితేజ నుంచి మాస్ జాతర అనే చిత్రం రిలీజ్ అయింది.

భాను భోగవరపు దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన మాస్ జాతర చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. దీనితో రవితేజ కెరీర్ లో ఫెయిల్యూర్ చిత్రాల జాబితాలో మాస్ జాతర చేరిపోయింది అని ప్రేక్షకులు అంటున్నారు. రవితేజకి ఇది వరుసగా ఐదవ ఫ్లాప్ చిత్రం. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర మూవీ ఆ జాబితాలో చేరింది.

‘మాస్ జాతర’ ఫలితం: ఐదో ప్లాప్‌గా నమోదు

గత ముడేళ్ళల్లో రవితేజ సినిమాలు గమనిస్తే.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా,  రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర చిత్రాలు చేశారు. వీటిలో ధమాకా మాత్రమే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు నిరాశపరిచాయి. దీని రవితేజకి ఏమైంది.. చిరాకు పుట్టించే పరమ రొటీన్ కథలు ఎందుకు ఎంచుకుంటున్నారు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రవితేజపై ట్రోలింగ్ జరుగుతోంది. అసలు రవితేజకి మాస్ మహారాజ్ అనే బిరుదు తొలగించాలి. తన పేరులో మాస్ ఉండడం వల్ల రొటీన్ మాస్ సినిమాలే చేయాలి అని అనుకుంటున్నాడేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఒకప్పుడు ఖడ్గం, నేనింతే, నా ఆటోగ్రాఫ్ లాంటి వైవిధ్యమైన అద్భుతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు పూర్తిగా మూస ధోరణిలో మునిగిపోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌పై దారుణంగా ట్రోలింగ్

మరోవైపు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆయన మీడియా సమావేశాల్లో, ఈవెంట్లలో నోరు జారుతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. అంతకు ముందు పుష్ప సినిమాపై, అదే విధంగా డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ మాస్ జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నేనేమీ చెప్పను. అన్ని మసాలాలు కరెక్ట్ గా ఉన్న మాస్ మూవీ ఇది.

ఈ సినిమా చూసి థియేటర్స్ లో మీరు షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సినిమా చూసిన అభిమానులు.. రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు అంతగా షాక్ అయ్యేలా ఏముంది అని సెటైర్లు వేస్తున్నారు. గతంలో నాగవంశీ కూడా వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాగే మాట్లాడి ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

రవితేజ కెరీర్ మలుపు తిరుగుతుందా, ఫ్యాన్స్ కోరిక మేరకు వైవిధ్యమైన సినిమాలు చేస్తాడా చూడాలి. రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు అంశాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.