
📌 Key Points
- ఉత్తరప్రదేశ్‌లో భార్యను బైక్ పై నుండి తోసేసి చంపిన భర్త
- బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ జరిగిన గొడవలో దారుణం
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు
- కట్నం కోసం వేధిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ లో ఓ వ్యక్తి తన భార్యను బైక్‌పై నుంచి తోసేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బైక్‌పై వెళ్తుండగా భార్యను తోసేసిన భర్త
దేశంలో రోజుకో దారుణం జరుగుతూనే ఉంది. మహిళలను టార్గెట్ చేసి, వేటాడి చంపేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అవసరం తీరాక భార్యలను కూడా హత మార్చుతున్నారు. మొన్నటికి మొన్న కోరుట్ల, లేటెస్ట్ గా ఏపీలో ఇలాంటి సంఘటనలు తెరపైకి వచ్చాయి. అయితే అచ్చం ఇలాగే మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బండి మీద నుంచి తన భార్యను కిందకు తోసేసి చంపేశాడు భర్త. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కు చెందిన ఓ వ్యక్తి బండి మీద నుంచి తోసేసి భార్యను చంపాడు. తన భార్యను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తూ తన భార్యను ఉద్దేశపూర్వకంగా కిందపడేశాడు భర్త. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కింద పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే చనిపోయింది. ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కోపంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు సదరు వ్యక్తి. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కట్నం కోసం వేధిస్తున్నాడని మృతురాలి ఫ్యామిలీ ఆరోపణలు చేస్తోంది. క్లిక్
బర్త్‌డే పార్టీలో గొడవ.. ఆపై దారుణం
కట్నం కోసమే హత్య చేశారా?
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. కట్నం వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


