|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం: నగరం స్తంభన, రోడ్లు జలమయం, ట్రాఫిక్ నరకం!

Published: 09-06-2026, 4:45 PM
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం: నగరం స్తంభన, రోడ్లు జలమయం, ట్రాఫిక్ నరకం!
  • మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ జనజీవనం స్తంభన.
  • హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్.
  • ఇది రుతుపవన ముందస్తు జల్లులేనని, అసలు రుతుపవనాలు ఇంకా రాలేదని IMD వెల్లడి.
  • ట్యాంక్‌బండ్, సచివాలయం వద్ద మోకాలు లోతు నీరు, చెట్లు కూలి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. పీక్ అవర్స్‌లో కురిసిన ఈ వర్షం నగర జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు, ఐటీ కారిడార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణ శాఖ ఇది రుతుపవన ముందస్తు జల్లులేనని స్పష్టం చేసింది.

నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

Hyderabad heavy Rain : భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరాన్ని ముంచెత్తుతూ కురిసిన భారీ వర్షం కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్‌లో ఈ వర్షం పడటంతో నగర జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన జంక్షన్లలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల తెరిచి ఉన్న డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

సుదీర్ఘ వేసవి కాలం తర్వాత కురిసిన ఈ భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ…. వాతావరణ శాఖ (IMD) కీలక విషయాన్ని వెల్లడించింది. మంగళవారం కురిసిన వర్షం నైరుతి రుతుపవనాల వల్ల వచ్చింది కాదని, ఇవి కేవలం రుతుపవన ముందస్తు (ప్రీ-మాన్‌సూన్) జల్లులు మాత్రమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానిలోకి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ దక్షిణ సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశించినప్పటికీ…. అవి ఇంకా హైదరాబాద్‌కు చేరుకోలేదు.

ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ కష్టాలు

రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:

రుతుపవనాలపై వాతావరణ శాఖ స్పష్టత

ట్యాంక్‌బండ్‌తో పాటు.. స‌చివాల‌యం ముందు ర‌హ‌దారుల‌పై మోకాలు లోతు మేర నీరు నిలిచిపోయింది. ఈ నీటిని హైడ్రా సిబ్బంది మళ్లించేందుకు తీవ్రంగా శ్రమించింది. ట్యాంక్‌బండ్ మీద‌ సికింద్రాబాద్ వైపు వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డ‌మే కాకుండా.. చెట్టు ప‌డిపోవ‌డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు అక్క‌డ ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. చెట్టును తొల‌గించే ప‌నుల‌తో పాటు.. వ‌ర‌ద సాఫీగా సాగేలా హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది నిమ‌గ్న‌మ‌య్యారు. క్షేత్ర‌ స్థాయిలో డీఆర్ ఎఫ్ సేవ‌లందిస్తున్నాయి. ర‌హ‌దారిపై ప‌డిన చెట్ల‌ను తొల‌గిస్తున్నారు. రోడ్ల‌పై నిలిచిపోయిన వ‌ర‌ద నీటిని పంపించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. శేరిలింగంప‌ల్లి, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి, షేక్‌పేట‌, టోలిచౌకి, మాధాపూర్ ప్రాంతాల‌తో పాటు.. సికింద్రాబాద్‌, హైద‌ర్‌గూడ ప్రాంతాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో సేవ‌లందిస్తున్నారు. దాదాపు 76 చోట్ల చెట్లు ప‌డిపోవ‌డంతో వాటిని తొల‌గించే ప‌నుల్లో హైడ్రా సిబ్బంది ఉన్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తంగా, హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరవాసులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, ట్రాఫిక్ కష్టాలు, రోడ్లు జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రుతుపవనాల రాక కోసం నగర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.