
📌 Key Points
- రైతన్నల ఖాతాల్లో రూ.6,000 జమ చేస్తున్న ఏపీ ప్రభుత్వం.
- మూడవ విడతగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి.
- రైతులు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- ఈకేవైసీ సమస్య ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించగలరు.
ఉగాది కానుకగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ చేస్తోంది. రైతులు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
ఉగాది కానుకగా ఏపీ ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలు అందించిన సర్కార్… మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేస్తోంది.
ఈ మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. ఈ విడత కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
ప్రతి రైతు ఖాతాలోకి రూ. 6 వేలు జమ కానున్న నేపథ్యంలో…. రైతులు వారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బులు జమ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.
ఈకేవైసీ సమస్య ఉంటే ఏం చేయాలి?
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో రాలేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతు ఆధార్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు. దీని ద్వారా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈకేవైసీ సమస్య ఉంటే… డబ్బులు జమ కావు. అప్పుడు వ్యవసాయశాఖ అధికారులను కలిసి తగిన పత్రాలను అందజేసి.. ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకుని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.


