|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెలిగొండ నిర్వాసితులకు సీఎం భారీ ఊరట: రూ.300 కోట్లు విడుదల, జూలై 31న నీటి విడుదల!

Published: 08-07-2026, 8:36 AM
వెలిగొండ నిర్వాసితులకు సీఎం భారీ ఊరట: రూ.300 కోట్లు విడుదల, జూలై 31న నీటి విడుదల!

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రూ.300 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. జూలై 31 నాటికి ప్రాజెక్ట్ మొదటి దశ ద్వారా నీటిని విడుదల చేస్తామని సీఎం కీలక ప్రకటన చేశారు. ఇది వేలాది కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది.

Key Points

1

వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ.

2

2,351 కుటుంబాలకు ఆర్థిక లబ్ధి, మార్కాపురం జిల్లాలో లబ్ధిదారులు.

4

ప్రాజెక్ట్ పూర్తికి రూ.10,580 కోట్లు, ఇప్పటికే రూ.6,736 కోట్లు ఖర్చు.

నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం విడుదల

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

వెలిగొండ ప్రాజెక్ట్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ (పునరావాసం – స్థిరనివాసం) నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిర్ణయంతో మార్కాపురం జిల్లా పరిధిలోని 2,351 నిర్వాసిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం త్యాగం చేసిన 2,351 నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకి రూ. 300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతలముడిపి, కాటమరాజు తండా, సాయిరామ్ నగర్ తదితర ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ నిధులను అందిస్తున్నాం,” అని ప్రకటించారు.

జూలై 31న వెలిగొండ ప్రాజెక్ట్ నీటి విడుదల

వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, లక్ష్యాలపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి విడత (ఫేజ్-1) ద్వారా నీటిని విడుద చేస్తామన్నారు. మొదటి దశ పూర్తి కావడం వల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు….. 4 లక్షల మంది దాహార్తి తీరుతుందని చెప్పారు. ఇక రెండో దశ (ఫేజ్-2) పనులు పూర్తయితే మరో 3.20 లక్షల ఎకరాలు పచ్చబడుతుందని, 11.20 లక్షల మందికి తాగునీటి కష్టాలు తప్పుతాయని వివరించారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం రూ. 10,580 కోట్లు అవసరమవుతాయని సీఎం వివరించారు. అందులో ఇప్పటివరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సంపూర్ణంగా పూర్తి కావడానికి ఇంకా రూ. 3,844 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…. ఈ ప్రాజెక్ట్ వేగాన్ని పెంచడానికి రూ. 759 కోట్లు ఖర్చు చేసిందని, అలాగే నిర్వాసితుల కోసం రూ. 905 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ మంజూరైన నిధుల్లోంచే శనివారం తొలి విడతగా రూ. 300 కోట్లను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్ట్ ఒక సంజీవని లాంటిదని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాలుగు జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, నీటి విడుదలపై సీఎం ప్రకటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తితో నాలుగు జిల్లాలకు సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.