
📌 Key Points
- హైదరాబాద్ నుండి సోమశిల, శ్రీశైలంకు హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి.
- ఈ నెల 9న ప్రారంభం కానున్న ఈ యాత్ర పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
- సోమశిలలో కృష్ణానదిలో బోటింగ్, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు.
- త్వరలో ఈ సేవలను నాగార్జున సాగర్, రామప్ప వంటి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త పర్యాటక సేవలను ప్రారంభించనుంది. హైదరాబాద్ నుండి సోమశిల, శ్రీశైలంకు హెలికాప్టర్ టూరిజం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
హైదరాబాద్ టు సోమశిల: హెలికాప్టర్ టూరిజం ప్రారంభం
కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశమార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. ఆ దిశగా తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా…. సోమశిల – శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది.
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.
కృష్ణానదిలో బోటింగ్, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువవస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప , నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరించనున్నారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
త్వరలో ఇతర పర్యాటక ప్రాంతాలకు విస్తరణ
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
తెలంగాణ పర్యాటక శాఖ చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్రంలోని పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని ఆశిద్దాం. రానున్న రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.


