|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైపర్ ఆది షాకింగ్ క్లారిటీ: పవన్ కళ్యాణ్ కోసం అంత వదిలేసి రాను!

Published: 19-12-2025, 6:44 AM
హైపర్ ఆది షాకింగ్ క్లారిటీ: పవన్ కళ్యాణ్ కోసం అంత వదిలేసి రాను!
  • హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, జనసేనకు మద్దతుదారు.
  • గత ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసి, విరాళం కూడా ఇచ్చాడు.
  • తన పని వదులుకొని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లనని స్పష్టం చేశాడు.
  • పవన్ కళ్యాణ్ కోరితేనే, తన పనికి ఆటంకం లేకుండా పార్టీ కోసం పని చేస్తాను అన్నాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన పని వదులుకొని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళనని, అవసరం వచ్చినప్పుడు మాత్రమే పవన్ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్, జనసేన పై హైపర్ ఆది ప్రేమ

Hyper Aadi : సినీ, టీవీ పరిశ్రమలో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. అందులో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ తో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది ఆ తర్వాత రైటర్ గా, కమెడియన్ గా టీవీ షోలు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఇప్పటికే అనేకసార్లు తెలిపాడు.(Hyper Aadi)

జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో అధికారికంగా ప్రచారం చేసాడు. జనసేన పార్టీ సభల్లో స్టేజిపై మాట్లాడాడు. జనసేన పార్టీకి విరాళం కూడా ఇచ్చాడు. తాజాగా హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడాడు.

వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వెళ్తారా?

హైపర్ ఆది మాట్లాడుతూ..  నేను సపరేట్ గా పాలిటిక్స్ కోసం ఏమి చేయను. నాకు తెలిసిన పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన ఎప్పుడు ఏ ఎన్నికల్లో నిలబడినా ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన కోసం తిరుగుతాను. నాకు తెలిసిన పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన రణస్థలం సభలో లక్షల మంది జనాలు, పవన్ కళ్యాణ్ గారి ముందు స్పీచ్ ఇచ్చాను. నా బెస్ట్ స్పీచ్ అదే. చాలా మంచి పాయింట్స్ కూడా మాట్లాడాను.

నేను అవతలి వాళ్ళను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. వాళ్ళు రాజకీయంగా ఏదయినా తప్పు చేస్తే వాటిని మాత్రమే ఎత్తి చూపుతాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. ఎవర్ని పర్సనల్ గా టార్గెట్ చేయొద్దు అని అంటారు. అవతలి వాళ్ళు పర్సనల్ గా టార్గెట్ చేసినా మనం చేయొద్దు, చేస్తే వాళ్లకు, మనకు తేడా ఏముంటుంది అంటారు. అందుకే నేను పర్సనల్ గా ఎవ్వర్నీ టార్గెట్ చేయను.

అన్ని వదిలేసి పార్టీలోకి వెళ్లి పని చేయాలి అని లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన పార్టీ కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తాను. దానికోసం నేను సినిమాలు, నా వర్క్ వదులుకొని చేయను. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం ఉండదు. మన పని వదిలేసి ఆయన కోసం తిరగడం ఆయనకు నచ్చదు. ఆ సమయానికి పని ఉంటే వెళ్లి చేయాలి. అదే ఆయన కోరుకుంటారు. మన జీవనాధారం వదిలేసి పార్టీ కోసం తిరగమని పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. మన పని చేసుకుంటూనే ఫ్రీ టైంలో ఇష్టం ఉంటే ఆయున కోసం పని చేయమంటారు. కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను, నేను ట్రిగ్గర్ అవుతాను, ఆయన్ని అన్న వాళ్ళ తప్పులు బయటకు తీసి మాట్లాడతాను అని అన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పిన కీలక సూచన

దీంతో హైపర్ ఆది జనసేన నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాడని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తాడని తెలుస్తుంది.

హైపర్ ఆది వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తన వృత్తిని గౌరవిస్తూనే, అవసరం మేరకు పార్టీకి మద్దతు ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ ఆశయానికి అనుగుణంగానే తాను నడుచుకుంటానని హైపర్ ఆది స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.