|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐఏఎఫ్ అధికారి భార్యకు దారుణం: అత్యాచారం, మతమార్పిడి, బ్లాక్ మెయిల్!

Published: 16-06-2026, 5:45 AM
ఐఏఎఫ్ అధికారి భార్యకు దారుణం: అత్యాచారం, మతమార్పిడి, బ్లాక్ మెయిల్!
  • ఐఏఎఫ్ అధికారి భార్యపై స్నేహితుడిచే అత్యాచారం, బలవంతపు మతమార్పిడి.
  • మత్తుమందు ఇచ్చి అత్యాచారం, రహస్య వీడియోలతో బ్లాక్ మెయిల్.
  • మౌలానా సాయంతో బలవంతంగా మతం మార్చి వివాహం, బీఫ్ తినమని ఒత్తిడి.
  • ప్రధాన నిందితుడు అయాజ్‌తో పాటు ముగ్గురి అరెస్ట్, మౌలానా కోసం గాలింపు.

నాగ్‌పూర్‌లో ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బ్లాక్ మెయిల్, వేధింపులకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా బలవంతంగా మతమార్పిడికి పాల్పడటం కలకలం రేపింది. వారి వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇక భరించలేక చివరకు జరిగిన విషయంలో తన భర్తకు చెప్పడంతో తాజాగా పోలీసులకు ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. .

నాగ్‍పూర్‍కు చెందిన ఐఏఫ్ అధికారి భార్య (24) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తన క్లాస్ మెట్ అయిన అయాజ్ తాజ్ మదారే అనే వ్యక్తి ఒక భూమి విషయంలో మాట్లాడాలంటూ బాధితురాలికి దగ్గర అయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక భూమికి సంబంధించి మాట్లాడుదామని ఒక హోటల్‍లో సమావేశానికి ఆహ్వానించినట్లు బాధితురాలు ఆరోపించింది. అక్కడ తనకు శీతలపానియంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చాడని ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయిన తనపై అత్యాచారానికి పాల్పడి రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశాడని ఆరోపించింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను చూయిస్తూ బ్లాక్ మెయిల్ చేసి అతడి స్నేహితులతో కూడా కలిసి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డినట్లు ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే ఫోటోలు, వీడియోలు తన భర్తకు పంపిస్తానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.

అత్యాచారం, మతమార్పిడి, బ్లాక్ మెయిల్

మే 31న కల్మేశ్వర్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ మౌలానా సాయంతో మతం మార్చి బలవంతంగా వివాహం చేసుకున్నాడని, అలాగే తనను బీఫ్ తినాలని బలవంతం చేశాడని ఆరోపించింది. అతడి వేధింపులు తాళలేక చివరకు ఈ విషయం తన భర్తకు చెప్పింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుల అరెస్ట్, దర్యాప్తు ముమ్మరం

రంగంలోకి దిగిన పోలీసులు అయాజ్ సహా ముగ్గురిని అరెస్టు చేయగా మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా కోసం గాలింపు చేపట్టారు. కాగా ఈ కేసులో ఒక వీడియో కీలక సాక్ష్యంగా మారింది. ఆ వీడియోలో నిందితుడు అయాజ్ సదరు మహిళకు మత్తు మందు ఇచ్చి ఓ ద్రవాన్ని చల్లుతూ హిప్నటైజ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. డీసీపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు లోతైన విచారణ జరుపుతున్నామని ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించామన్నారు. పరారీలో ఉన్న మౌలానా కోసం ఒక బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన నాగపూర్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇటీవల టీసీఎస్ లో తోటీ ఉద్యోగులపై బలవంతంగా మతమార్పిడుల ఘటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులోనూ ఏకంగా మౌలాన చేత బాధితురాలికి మతమార్పిడి చేయడంతో పాటు ఏకంగా పెళ్లి చేసుకోవడం, బీఫ్ తినమని బలవంత పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ కేసులో నిందితుల అరెస్ట్, మౌలానా కోసం గాలింపు కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలు సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.