|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇళయరాజాకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు! ఇక కాపీరైట్ కేసులు వేసే ఛాన్స్ లేదా?

Published: 17-02-2026, 9:35 AM
ఇళయరాజాకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు! ఇక కాపీరైట్ కేసులు వేసే ఛాన్స్ లేదా?
  • ఇళయరాజా పాటలపై కాపీరైట్ వివాదం: సరిగమ సంస్థతో కోర్టులో పోరు!
  • 134 సినిమాల్లోని పాటలను ఉపయోగించకుండా ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్!
  • సరిగమ ఆడియో సంస్థకు అనుకూలంగా తీర్పు: ఇళయరాజాకు ఎదురుదెబ్బ!
  • ఇకపై ఆ పాటలపై కాపీరైట్ కేసులు వేసే అధికారం లేదన్న కోర్టు!

సంగీత ప్రపంచంలో సంచలనం! ఇళయరాజాకు ఊహించని షాక్ తగిలింది. కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!

ఇళయరాజా వర్సెస్ సరిగమ: అసలేం జరిగింది?

Ilayaraja: ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. కానీ, ఈమధ్య ఆయన పేరు చెప్తే కోర్టు కేసులు గుర్తుకు వస్స్తున్నాయి. దానికి కారణం, ఇటీవల ఆయన వేస్తున్న కేసులో. అనుమతి లేకుండా తన పాటలను వేరే సినిమాల్లో వాడటంపై ఆయన కేసులు వేస్తూ వస్తున్నారు. కాపీరైట్ పేరుతో ఆయన వేస్తున్న కేసుల్లో చాలావరకు ఆయనకు అనుకూలంగానే తీర్పులే వచ్చాయి.

కానీ, తాజాగా ఢిల్లీ హైకోర్టు మాత్రం ఆయనకు షాకిచ్చింది. అసలు విషయం ఏంటంటే, ‘అగత్యా’ సినిమా విడుదల సమయంలో ఇళయరాజా(Ilayaraja), సరిగమ ఆడియో సంస్థ మధ్య వివాదం రాజుకుంది. ఆ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులోనే ఢిల్లీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేం తవరకు సరిగమ ఆడియో సంస్థకు చెందిన 134 సినిమాల్లో పాటలను ఇళయారాజా ఉపయోగించడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి, ఇకపై ఆ పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు అధికారం లేదని స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

కాపీరైట్ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా?

ఇళయరాజా కేసులో కోర్టు తీర్పు సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ విషయంపై మరింత సమాచారం త్వరలో అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.